IND vs IRE 1st T20 : ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం
7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఓటమి
IND vs IRE 1st T20 : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ఐర్లాండ్ కు చుక్కలు చూపించింది మొదటి టి20(IND vs IRE 1st T20) మ్యాచ్ లో. ఐర్లాండ్ లోని డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ ను అంపైర్లు 12 ఓవర్లకు కుదించారు. దీంతో ప్రత్యర్థి నిర్దేశించిన 109 పరుగుల టార్గెట్ ను భారత్
సునాయసంగా ఛేదించింది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
111 పరుగులు చేసి సత్తా చాటింది. ఐపీఎల్ లో ఫుల్ జోష్ మీదున్న ఇషాన్ కిషన్ అదే జోరు కొనసాగించాడు. కేవలం 11 బంతులు మాత్రమే
ఆడి 26 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి.
మరో ఓపెనర్ దీపక్ హూడా 29 బాల్స్ ఆడి 47 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. అనంతరం
బరిలోకి దిగిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతులు ఆడి 1 ఫోర్ 3 సిక్సర్లతో 24 రన్స్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
దీపక్ హూడా, పాండ్యా కలిసి మూడో వికెట్ కు 64 రన్స్ చేశారు. అంతకు ముందు కొత్తగా పగ్గాలు చేపట్టిన పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐర్లాండ్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 రన్స్ చేసింది. హార్దిక్ , భువీ, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఓపెనర్లు స్టిర్లింగ్ 4, బల్పిర్నీ
సున్నాకే వెనుదిరిగారు.
గ్యారెత్ 8 పరుగులు చేసి నిరాశ పరిచారు. దీంతో 22 రన్స్ కే కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన
టెక్టర్ దుమ్ము రేపాడు.
భారత(IND vs IRE 1st T20) బౌలర్ల భరతం పట్టాడు. 33 బంతుల్లో 64 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : విజయానికి అడుగు దూరంలో ఇంగ్లండ్