Owaisi : బీజేపీని ఓడించే సత్తా ఎస్పీకి లేదు – ఓవైసీ
అఖిలేష్ యాదవ్ ను టార్గెట్ చేసిన ఎంఐఎం చీఫ్
Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రాంపూర్ , అజంగఢ్ లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
సమాజ్ వాది పార్టీకి బీజేపీని ఓడించే శక్తి లేదని, వారికి మేధో నిజాయితీ లేదని యూపీ ఎన్నికల ఫలితాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలకు పూర్తిగా అర్థమై పోయింది.
బీజేపీకి ఎవరు బి – టీమో సి-టీమోనని ఓవైసీ(Owaisi) ధ్వజమెత్తారు. కాగా ఈ రెండు నియోజకవర్గాలు గతంలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీకి గట్టి పట్టుగా ఉంటూ వచ్చాయి.
కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ రెండో సారి అధికారంలోకి చరిత్ర సృష్టించింది.
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు అజంగఢ్ లోక్ సభ నియోజకవర్గం పూర్తి మద్దతు తెలుపుతూ వచ్చింది. కానీ ఈసారి బీజేపీ అభ్యర్థి 11 వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించి గెలుపొందారు.
ఎంపీ పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక రాంపూర్ లో కూడా ఎస్పీకి పట్టున్న నియోజకవర్గం.
ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి ఏకంగా 42,000 వేల ఓట్ల మెజారిటీతో ఎస్పీ అభ్యర్థిపై ఘన విజయాన్ని నమోదు చేశారు. దీంతో రెండు నియోజకవర్గాలలో సమాజ్ వాదికి కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇది చారిత్రిక విజయం అని పేర్కొన్నారు.
Also Read : తాను రబ్బర్ స్టాంప్ కానని నిరూపిస్తా