Deepak Kesarkar : మరాఠా వెళతాం సత్తా చాటుతాం
రెబల్ శివసేన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్
Deepak Kesarkar : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది. శివసేన పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేశారు. మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలో వీరంతా అక్కడే ఉంటూ చక్రం తిప్పుతున్నారు.
ఇదిలా ఉండగా తమకు 51 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. తమదే అసలైన శివసేన పార్టీ అని స్పష్టం చేశారు. మరో వైపు మరాఠా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 16 సభ్యులపై అనర్హత వేటు వేస్తున్నట్లు నోటీసులు పంపించారు.
అవిశ్వాస తీర్మానం చేపట్టాలని కోరుతూ రెబల్ ఎమ్మెల్యేలు చేసిన దరఖాస్తును పూర్తిగా తిరస్కరించారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కరోనా కారణంగా ఆస్పత్రి పాలైన గవర్నర్ కోషియార్ డిశ్చార్జి అయ్యారు.
డీజీపీని పిలిపించి రెబల్ ఎమ్మెల్యేల కుటుంబాలకు, ఇళ్లకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై శివసేన రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్(Deepak Kesarkar) సోమవారం మాట్లాడారు.
మూడు నాలుగు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తర్వాత నేరుగా తామంతా మహారాష్ట్రకు వెళతామని, తమ సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పారు.
ప్రస్తుతానికి మా సంఖ్య 50కి పైగా దాటింది. ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు తమతో చేరుతారని ప్రకటించారు. మొత్తం మా బలం 51కి చేరుతుందన్నారు.
తిరుగుబాటు శిబిరంలో మరో మంత్రి ఉదయ్ సావంత్ చేరారు. ఇప్పటి వరకు 9 మంది మంత్రులు చేరడం విశేషం. కేసర్కర్ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తాము సీఎం ఉద్దవ్ ఠాక్రే పట్ల గౌరవం ఉందన్నారు. తమ వర్గం ఏ పార్టీతోనూ విలీనం చేయమన్నారు.
Also Read : బీజేపీని ఓడించే సత్తా ఎస్పీకి లేదు – ఓవైసీ