Indian Origin Man Shot Dead : ప్రవాస భారతీయుడి కాల్చివేత
సత్నామ్ సింగ్ గా గుర్తింపు
Indian Origin Man Shot Dead : అమెరికాలో కాల్పుల మోత ఆగడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నా కంట్రోల్ చేయలేక పోతున్నారు. తుపాకుల నియంత్రణ చట్టంపై దేశాధ్యక్షుడు బైడెన్ సంతకం చేసిన కొన్ని గంటల లోపే మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
యుఎస్ లో పార్క్ చేసిన కారులో కూర్చుని ఉన్న భారతీయ సంతతికి(Indian Origin Man Shot Dead) చెందిన సత్నామ్ సింగ్ ను కాల్చి చంపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం మధ్యాహ్నం 3.46 గంటలకు న్యూయార్క్ లో చోటు చేసుకుంది.
అతడి మెడ పై గాయాల ఆనవాళ్లు ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన సత్నామ్ సింగ్ వయస్సు 31 ఏళ్లు. తన ఇంటి నుండి వీధిలో పార్క్ చేసిన రెంట్ కోసం తెచ్చుకున్న ఎస్ వీ యూ కారులో కూర్చున్న అతడిని కాల్చి చంపారు.
ఓ సాయుధుడు అతడిపై కాల్పులకు తెగ బడ్డాడని న్యూయార్క్ డైలీ న్యూస్ తెలిపింది. అతను కాల్చి చంప బడిన వీధి లోనే సత్నామ్ సింగ్ నివసించాడని పోలీసులు తెలిపారు.
సింగ్ ఛాతీ, మెడపై కాల్పులు జరిపాడు దుండగుడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సింగ్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు మరణించాడని చెప్పారు.
ఏదో పని నిమిత్తం స్నేహితుడి నుంచి కారు తెచ్చుకున్నాడని తెలిపారు. ఇదిలా ఉండగా ముష్కరుడు సత్నామ్ సింగ్ ను చంపాలని లక్ష్యంగా చేసుకున్నాడా లేదా కారు యజమానిని చంపాలని ఆశిస్తున్నాడా అనే దానిపై ఇంకా వివరాలు తెలియ లేదన్నారు.
Also Read : రానా అయ్యూబ్ కు ట్విట్టర్ బిగ్ షాక్