Rahul Gandhi : అగ్నిప‌థ్ ఆపేంత దాకా స‌త్యాగ్ర‌హం ఆగ‌దు

స‌త్యాగ్ర‌హ్ దీక్ష కొన‌సాగుతూనే ఉంటుంది

Rahul Gandhi : దేశంలోని విమానాశ్ర‌యాన్ని 50 ఏళ్లుగా త‌న స్నేహితుల‌కు అప్ప‌గించిన ప్ర‌ధాని మోదీ అగ్నిప‌థ్ స్కీంలో మాత్రం కేవ‌లం నాలుగేళ్ల‌కు ప‌రిమితం చేశారంటూ మండిప‌డ్డారు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. అగ్నిపథ్ స్కీం వ‌ల్ల దేశానికి న‌ష్టం త‌ప్ప లాభం లేద‌న్నారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ర‌క్ష‌ణ రంగాన్ని నిర్వీర్యం చేయాల‌ని అనుకుంటున్నార‌ని రాహుల్ గాంధీ ప్ర‌ధాన మంత్రిని ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టికే అన్నింటిని గంప‌గుత్త‌గా అమ్మేయ‌డ‌మో లేదా లీజుకు ఇవ్వ‌డమో చేస్తూ వ‌స్తున్నారు. ఇదే మీరు గ‌త ఎనిమిది సంవ‌త్సార‌ల పాల‌న‌లో సాధించింది. ఇందుకోస‌మేనా మిమ్మ‌ల్ని ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది అంటూ నిల‌దీశారు.

దేశంలో ప్ర‌తి ఏటా 2 కోట్ల జాబ్స్ ఇస్తామ‌ని అన్నారు. ఒక్క ర‌క్ష‌ణ రంగంలోనే 70 వేల‌కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని భ‌ర్తీ చేశారో శ్వేతప‌త్రం విడుద‌ల చేయాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

అంబానీ, అదానీ లాంటి బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేందుకు మీరు పాల‌న సాగిస్తున్నారు త‌ప్ప ప్ర‌జ‌ల కోసం కాదంటూ నిప్పులు చెరిగారు. ప్ర‌చార ఆర్భాటంపై ఉన్నంత ఫోక‌స్ క‌నీస స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పై లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

ఏదో ఒక రోజు ప్ర‌జ‌లు తాము చేసిన త‌ప్పు తెలుసుకుంటారు. ఆరోజున మిమ్మ‌ల్ని ఇంటికి సాగ‌నంప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. సోమ‌వారం కాంగ్రెస్ పార్టీలో దేశ వ్యాప్తంగా అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా యువ‌త స‌త్యాగ్ర‌హం చేస్తోంద‌న్నారు.

యువ‌త‌కు న్యాయం జ‌రిగేంత దాకా ఈ పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

Also Read : బ‌ల‌మైన దేశంగా భార‌త్ – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!