Eknath Shinde : రాజ్ థాకరేకు ఏక్ నాథ్ షిండే పరామర్శ
ఆరోగ్యం గురించి వాకబు చేసిన
Eknath Shinde : శివసేన పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నారు. ఒక వేళ అదృష్టం కలిసి వస్తే ఆయన సీఎంగా అయ్యే చాన్స్ ఉంది.
ఈ తరుణంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన రాజ్ థాకరేతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. రాజ్ థాకరే కు ఇటీవల ఆరోగ్యం బాగా లేక పోవడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.
తాజాగా డిశ్చార్జ్ కావడంతో ఫోన్ లో ఆరోగ్య పరిస్థితి గురించి ఏక్ నాథ్ షిండే ఆరా తీసినట్లు సమాచారం. అంతే కాకుండా మరాఠాలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై కూడా వీరిద్దరూ చర్చించారు.
ఇప్పటికే రాజ్ థాకరే వర్సెస్ ఉద్దవ్ థాకరే మధ్య ఉప్పు నిప్పు లాగా తయారైంది. ఇంకో వైపు కేంద్రం ఒత్తిళ్లు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజు రోజుకు ముదురుతోంది.
సోమవారం సుప్రీంకోర్టు షిండే వర్గానికి ఊరట ఇచ్చేలా తీర్పు చెప్పింది. ఈ మేరకు జూలై 11 వరకు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేయొద్దంటూ శివసేన పార్టీ విప్ , డిప్యూటీ స్పీకర్ లకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో రాజకీయం మొత్తం ఇప్పుడు అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ , కేంద్ర సర్కార్ , దేవేంద్ర ఫడ్నవిస్ , అమిత్ షా చుట్టూ తిరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏది ఏమైనా ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) రాజ్ థాకరేతో మాట్లాడటం మహారాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపింది.
Also Read : 16 మంది ఎమ్మెల్యేలపై చర్యలు వద్దు