Air Force Applications : అగ్నిపథ్ స్కీంకు భారీగా దరఖాస్తులు
4 రోజుల్లో ఎయిర్ ఫోర్స్ కు 94,281
Air Force Applications : ఓ వైపు కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. మరో వైపు నిరుద్యోగులు, యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇప్పటికే రక్షణ దళాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఎయిర్ ఫోర్స్ 4 రోజుల్లో అగ్నిపథ్(Air Force Applications ) కింద ఏకంగా 94,281 దరఖాస్తులు స్వీకరించింది.
జూన్ 14న ఈ పథకాన్ని ప్రకటించిన తర్వాత దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 56, 960 అప్లికేషన్లు వచ్చాయి. వారం రోజుల పాటు పలు రాష్ట్రాలను కదిలించాయి.
ప్రతిపక్ష పార్టీలు అగ్ని పథ్ స్కీం ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా జూలై 5న రిజిస్ట్రేషన్ ముగుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈ పథకం కింద 17 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకులను నాలుగు ఏళ్ల పదవీ కాలానికి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ జాబ్స్ పర్మినెంట్ మాత్రం కావు.
25 శాతం మందిని రెగ్యులర్ సర్వీస్ కు పరిగణలోకి తీసుకుంటారు. పెద్ద ఎత్తున యువకుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో కేంద్రం దిగి వచ్చింది.
జూన్ 16న ఈ పథకం కింద రిక్రూట్ మెంట్ కోసం గరిష్ట వయో పరిమితిని 2022 సంవత్సరానికి 21 నుండి 23 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర పోలీస్ బలగాలలోకి ప్రవేశానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఒక రకంగా కేంద్రానికి ఇది ఖుష్ కబర్ అన్నమాట.
Also Read : అగ్నిపథ్ ఆపేంత దాకా సత్యాగ్రహం ఆగదు