PM Modi Meets : కీల‌క అంశాల‌పై జీ7లో మోదీ ప్ర‌స్తావ‌న

జోసెఫ్ బైడ‌న్ ..జ‌స్టిన్ ట్రూడ్ తో భేటీ

PM Modi Meets : జ‌ర్మ‌నీలో జ‌రిగిన జీ7 స‌మ్మిట్ లో కీల‌క అంశాలపై ప్ర‌స్తావించారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi Meets). ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ , కెన‌డా పీఎం జ‌స్టిన్ ట్రూడో తో పాటు పాల్గొన్న దేశాధినేత‌లు ప్ర‌ధాని మోదీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఓలాఫ్ స్కోల్డ్ స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది అత్య‌ధికంగా ఉగ్ర‌వాదం. ప్ర‌ధానంగా అమెరికాలో కాల్పుల మోత కొన‌సాగుతోంది.

ప్ర‌వాస భార‌తీయుడిపై గుర్తు తెలియ‌ని దుండ‌గుడు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. ఆయా దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు కొన‌సాగించాల‌ని పిలుపునిచ్చారు న‌రేంద్ర మోదీ.

ఇదే స‌మ‌యంలో తుపాకుల నియంత్ర‌ణకు సంబంధించిన చ‌ట్టంపై సంత‌కం చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు జోసెఫ్ బైడెన్. ర‌క్ష‌ణ స‌హ‌కారం ఉండాల‌ని ఆయా దేశాల అధినేత‌లు సూచించారు.

ఇదే స‌మ‌యంలో ఉక్రేనియ‌న్ ప్రెసిడెంట్ జెల‌న్ స్కీపై ర‌ష్యా దాడి చేయ‌డాన్ని ప్ర‌స్తావించారు జ‌స్టిన్ ట్రూడో. ఇరు దేశాల మ‌ధ్య యుద్దం ఉండ కూడ‌ద‌ని సూచించారు.

ఇదే స‌మ‌యంలో న‌రేంద్ర మోదీ, కెన‌డా పీఎం మాక్రాన్ కీల‌క స‌మ‌స్య గురించి చ‌ర్చించారు. కాగా ర‌ష్యా యుద్దం నుంచి విర‌మించుకునేంత దాకా త‌మ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని కెన‌డా పీఎం స్ప‌ష్టం చేశారు ఈ సంద‌ర్భంగా.

అయితే ఇదే క్ర‌మంలో వీలైనంత ఎక్కువ మంది ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌ను తీసుకుంటామ‌న్నారు. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ కూడా క‌లుసుకున్నారు ప్ర‌ధాన మంత్రి మోదీ.

Also Read : అగ్నిప‌థ్ స్కీంకు భారీగా ద‌ర‌ఖాస్తులు

Leave A Reply

Your Email Id will not be published!