Second Phase T Hub : అంకురాలకు టీ హబ్ ఆలంబన
ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Second Phase T Hub : దేశానికే తలమానికంగా నిలిచేలా హైదరాబాద్ స్టార్టప్ లకు కేరాఫ్ గా నిలిచింది. ఒకప్పుడు ఇండియా అంటే సిలికాన్ సిటీగా బెంగళూరుకు పేరుండేది.
కానీ తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీన్ మారింది. పూర్తిగా దిగ్గజ కంపెనీలన్నీ ఈ భాగ్యనగరం వైపు చూస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 400 కోట్ల ఖర్చుతో 3.62 లక్షల చదరపు అడుగుల్లో టీ హబ్ రెండో దశ(Second Phase T Hub) నిర్మాణం పూర్తయింది. ఒకే చోట 2 వేలకు పైగా స్టార్టప్ లు నిర్వహించేలా దీనిని రూపొందించారు.
టీఎస్ఐసీ, అటల్ మిషన్ , స్టార్టప్ ఇండియా ఆఫీసులు కూడా ఇక్కడే కొలువు తీరేలా ఏర్పాటు చేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీలకు అధిక ప్రయారిటీ ఇస్తున్నారు.
ఇందుకు సంబంధించి మంత్రి కేటీఆర్ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభిస్తారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా స్టార్టప్ రంగానికి చెందిన నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తారు.
ఈ ప్రారంభోత్సవానికి అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్, సైయంట్ ఫౌండర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, స్కై మోర్ ఫౌండర్ దేశ్ పాండే , అథేరా వెంచర్స్ ఎండీ కన్నల్ రేఖి తో పాటు సిలీకాన్ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇక ఈ టీ హబ్ భవనంలో మొదటి ఫ్లోర్ ను వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం ఉచితంగా కేటాయించారు. స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ,
సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ , సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఇక్కడ చోటు కల్పించనున్నారు.
స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ సెల్ కూడా ఇక్కడే కొలువు తీరనున్నాయి. ఇక తొలి టీ హబ్ లో 1,100 స్టార్టప్ లు స్టార్ట్ కాగా రూ. 10 వేల కోట్ల ఫండింగ్ అందడం విశేషం.
Also Read : రానా అయ్యూబ్ కు ట్విట్టర్ బిగ్ షాక్