Joe Biden & Modi : హలో మోదీ హౌ ఆర్ యూ – బైడెన్
ప్రధానిని పలకరించిన ప్రెసిడెంట్
Joe Biden & Modi : జర్మనీ పర్యటనలో ఉన్న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(Joe Biden & Modi) కి ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చారు అమెరికా దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. జీ7 దేశాల సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ తో పాటు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోతో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు.
ఈ తరుణంలో అనుకోకుండా అక్కడికి వచ్చారు యుఎస్ చీఫ్ బైడెన్. ఆయనే ప్రధానిని మోదీ హౌ ఆర్ యూ అంటూ ఆప్యాయంగా పలకరించారు. అంతే కాదు మోదీ చేతిలో చేయి వేసి పలకరించడంతో మోదీ సంతోషానికి లోనయ్యారు.
ఆయన కూడా బైడెన్ ను పలకరించడంతో అక్కడ కెమెరాలు క్లిక్కుమనిపించాయి. వీరిద్దరి సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తామిద్దరి మధ్య ఉన్న బంధం చాలా బలమైనదని ఇద్దరూ నేతలు చెప్పకనే చెప్పారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపు కోవడం చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా గత నెల మేలో జరిగిన క్వాడ్ సమ్మిట్ లో నరేంద్ర మోదీ , జోసెఫ్ బైడెన్ లు తమ ఉపయోగకరమైన సంభాషణను కొనసాగించాలని , భారత్ యుఎస్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని అంగీకారానికి వచ్చారు.
ఇక జర్మనీలో జరిగిన జీ7 సమ్మిట్ కు ఆహ్వానించిన ఐదు భాగస్వామ్య దేశాలలో భారత దేశం కూడా ఉంది. ఇక ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Also Read : కీలక అంశాలపై జీ7లో మోదీ ప్రస్తావన