46 Migrants Die : శాన్ ఆంటోనియోలో 46 మంది మృతి
వలస కార్మికులేనని అనుమానం
46 Migrants Die : అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. శాన్ ఆంటోనియోలోని ట్రక్కులో 46 మంది చని పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
చుట్టూ అంబులెన్స్ లు ఆగి ఉన్నాయి. ఎలా , ఎందుకు జరిగిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ట్రయిలర్ ట్రక్కులో డజన్ల కొద్దీ వ్యక్తులు చని పోయినట్లు గుర్తించారు.
ఈ ఘటన నైరుతి శాన్ ఆంటోనియో లోని రిమోట్ బ్యాక్ రోడ్ లో అనుమానిత వలసదారులతో కూడిన ట్రాక్టర్ ట్రైలర్ రిగ్ ను సోమవారం కనుగొన్నారు. 46 మంది చని పోయారని (46 Migrants Die) మరో 16 మందిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సంఘటన స్థలంలో ఉన్న ఒక నగర కార్మికుడు సాయంత్రం 6 గంటల ముందు సాయం కోసం కేకలు వేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారని పోలీస్ చీఫ్ విలియం మెక్ మనుస్ వెల్లడించారు.
ట్రైలర్ కు పాక్షికంగా గేట్ తెరవడం జరిగిందన్నారు. ఇక ఆస్పత్రికి తరలించిన 16 మందిలో 12 మది పెద్దలు, నలుగురు పిల్లలు ఉన్నారని
ఫైర్ చీఫ్ చార్లెస్ హెడ్ తెలిపారు.
ట్రైలర్ లో నీరు కనిపించ లేదన్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు మానవ అక్రమ రవాణాతో ఖచ్చితంగా సంబంధం కలిగి ఉన్నారా అనేది అస్పష్టంగా ఉందని మెక్ మనుష్ చెప్పారు.
ట్రైలర్ లో ఉన్న వారు యుఎస్ లోకి వలసదారుల స్మగ్లింగ్ ప్రయత్నంలో భాగమని, ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోందన్నారు మెక్ మానస్ వెల్లడించారు.
Also Read : తుపాకీ నియంత్రణ చట్టానికి బైడెన్ ఓకే