Sanjay Raut : జూలై 11 వరకు అక్కడే రెస్ట్ తీసుకోండి
రెబల్ ఎమ్మెల్యేలపై రౌత్ కామెంట్స్
Sanjay Raut : శివసేనపై తిరుగుబాటు ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలపై శివసేన పార్టీ అధికార ప్రతినిధి , ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. వారిపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కోర్టును ఆశ్రయించారు.
దీంతో సుప్రీంకోర్టు వచ్చే నెల జూలై 11 వరకు ధిక్కార స్వరం వినిపించిన ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవద్దంటూ శివసేన పార్టీ చీఫ్ విప్ , డిప్యూటీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై సంజయ్ రౌత్(Sanjay Raut) తాజాగా స్పందించారు. చర్యలు తీసుకోవద్దని అని అంటే అర్థం రెస్ట్ తీసుకోవాలని అంటూ పేర్కొన్నారు ఎంపీ. ఇదిలా ఉండగా మహారాష్ట్ర మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే ఫైర్ అవుతూ వచ్చారు.
అనంతరం ఆయన ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించాడు. కొంత మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండా ఎగుర వేశాడు. అక్కడి నుంచి గుజరాత్ లోని సూరత్ కు వెళ్లాడు.
అక్కడ అయితే బాగుండదంటూ అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ కు మకాం మార్చారు. రోజుకు రూ. 8 లక్షల ఖర్చుతో అక్కడే ఉన్నారు. మొదట వారం రోజులకు బుక్ చేసుకున్నారు.
ఇంకా మరాఠా పరిస్థితి ఒక కొలిక్కి రాక పోవడంతో మరికొన్ని రోజులు పొడిగించారు. ఇప్పటి వరకు ఇవాల్టితో కలుపుకుంటే దాదాపు 8 రోజులకు పైగా అవుతోంది.
ఆరోజు వరకు ఎమ్మెల్యేలంతా డిప్యూటీ స్పీకర్ కు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. చివరి వరకు చాన్స్ ఇచ్చామని కానీ వారు వేరే వాళ్ల ప్రభావంలో పడ్డారంటూ ఆరోపించారు.
Also Read : ఇది బాలా సాహెబ్ హిందూత్వ విజయం