Kiren Rijiju : అపూర్వ ఆదరణ అనూహ్య స్పందన – రిజిజు
మోదీకి రోజు రోజుకు పెరుగతున్న ఆదరణ
Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం గర్వించ దగిన నాయకుడిగా యావత్ ప్రపంచం ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తోందని పేర్కొన్నారు.
మోదీ జర్మనీలోని జీ7 సదస్సులో పాల్గొన్న సందర్భంగా లభించిన ఆదరణ అపూర్వమని తెలిపారు. ప్రవాస భారతీయులు మోదీ మోదీ అంటూ చేసిన నినాదాలు పీఎంకు ఉన్న పవర్ ఏమిటో తెలియ చేస్తుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
ఎలాంటి రాజకీయాలు లేవు. మరెలాంటి భావజాలాలు లేవని స్పష్టం చేశారు. ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దేశానికి దిశా నిర్దేశనం చేయడంలో అందరి కంటే ముందున్నారని కొనియాడారు కిరణ్ రిజిజు(Kiren Rijiju).
తమకు నాయకుడైనందుకు గర్వంగా ఉందని తెలిపారు. తానే కాదు, తన మంత్రివర్గంతో పాటు యావత్ భారతీయులంతా మోదీని చూసి ఆనంద పడుతున్నామని పేర్కొన్నారు కిరణ్ రిజిజు.
జర్మనీలో కొలువు తీరిన వివిధ దేశాల అధినేతలు సైతం మోదీని ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. ఇది మోదీకి ఉన్న చరిష్మా ఏమిటో తెలియ చేస్తుందన్నారు.
ఇదిలా ఉండగా రెండు రోజుల జర్మనీ పర్యటన ముగించుకున్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. జీ7 సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రధాన అంశాల గురించి ప్రస్తావించారు. వీటిపై పోరాడేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు మ్యూనిచ్ లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు.
Also Read : ప్రపంచం చూపు భారత దేశం వైపు
No politics & no ideology but just as Indians, WE all feel proud that our Prime Minister @Narendramodi Ji is being lauded and recognised by the world leaders and global community with utmost respect and admiration. pic.twitter.com/lfBTojyDYG
— Kiren Rijiju (@KirenRijiju) June 28, 2022