Rahul Gandhi : శాంతితోనే సమాజం మనుగడ – రాహుల్
హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదు
Rahul Gandhi : రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) . అన్ని వర్గాల వారు సంయమనం పాటించాలని కోరారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీలకమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
ఉదయ్ పూర్ లో జరిగిన దారుణ హత్యతో తాను దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలిపారు. మతం పేరుతో క్రూరత్వాన్ని సహించ లేమని పేర్కొన్నారు. దీని కారణంగా భయాందోళనలను వ్యాప్తి చేసే వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మనందరం కలిసి ద్వేషాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . శాంతి ఒక్కటే మనందరికీ మార్గమని పేర్కొన్నారు.
దోషులకు కఠిన శిక్ష పడాలని , మతం పేరుతో ద్వేషం , హింసను ప్రేరేపించే వారిని ఉపేక్షించ కూడదని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక వాద్రా పేర్కొన్నారు.
ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఘటన తనను బాధకు గురి చేసిందని తెలిపారు. హింస పరిష్కారం కాదు. శాంతి, సహనం, సంయమనం మాత్రమే సమాజాన్ని పదిలంగా ఉంచుతుందని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ.
మనమంతా కలిసికట్టుగా ఒకే భావనను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఉదయ్ పూర్ లో ఇవాళ చోటు చేసుకున్న ఘటన దేశాన్ని కదిలించింది. ఒక రకంగా తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
Also Read : నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి జుబైర్