Samson & Hooda Record : సంజూ శాంసన్..హూడా అరుదైన రికార్డ్
87 బంతుల్లో 176 పరుగుల భాగస్వామ్యం
Samson & Hooda Record : డబ్లిన్ లో ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదే మైదానంలో అరుదైన రికార్డు నమోదైంది భారత జట్టు తరపున.
స్టార్ హిట్టర్ కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ , దీపక్ హూడా(Samson & Hooda Record) కలిసి కేవలం 87 బంతుల్లో 167 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. దీపక్ హూడా 57 బంతులు ఎదుర్కొని 104 పరుగులు చేశాడు.
ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇందులో 9 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. కేవలం ఫోర్లు , సిక్సర్లతో కలిపి హూడా 72 రన్స్ చేశాడు. ఇక
సంజూ శాంసన్ రెచ్చి పోయాడు.
గతంలో వన్ డౌన్ లో వచ్చిన శాంసన్ ను మేనేజ్ మెంట్ ఓపెనింగ్ కు పంపించింది. వారి ప్లాన్ వర్కవుట్ అయ్యింది. కేవలం 42 బంతులు ఆడిన శాంసన్ 77 పరుగులు చేశాడు.
ఇందులో 9 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల ద్వారా 36 పరుగులు రాబడితే సిక్స్ లతో 24 పరుగులు వచ్చాయి. ఈ రెండూ కలిపితే 70
పరుగులు చేశాడు. వీరిద్దరూ భారత జట్టు తరపున టి20ల్లో అత్యధిక రన్స్ రికార్డ్ భాగస్వామ్యం నమోదు చేశారు.
ఓపెనర్ ఇషాన్ కిషన్ 3 పరుగులకే వెనుదిరగడంతో బరిలోకి వచ్చిన హూడా శాంసన్ తో కలిసి హోరెత్తించారు. డెలానీ ఓవర్ లో శాంసన్
4,6 కొట్టాడు. హూడా 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఇక 31 బంతుల్లోనే శాంసన్ తన కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక రికార్డుల పరంగా చూస్తే ఒకటవ వికెట్ కు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్
2017లో ఇండోర్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 165 రన్స్ చేశారు.
2018లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఒకటవ వికెట్ కు 160 పరుగులు చేశారు. 2017లో న్యూఢిల్లీలో న్యూజిలాండ్ తో
జరిగిన టి20 మ్యాచ్ లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ 158 రన్స్ చేశారు.
అయితే ప్రస్తుతం వీరి రికార్డును బద్దలు కొట్టారు శాంసన్ , హూడా. రెండో వికెట్ కు 176 రన్స్ చేసి సత్తా చాటారు.
Also Read : ఐర్లాండ్ పరాజయం భారత్ సీరీస్ కైవసం