Fadnavis & Eknath Shinde : రాజ‌కీయ చ‌ద‌రంగంలో రాజు ఎవ‌రో

అయితే షిండే లేదంటే ఫ‌డ్న‌వీస్

Fadnavis & Eknath Shinde : మ‌రాఠాలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది(Fadnavis & Eknath Shinde). ప్ర‌స్తుతం నెంబ‌ర్ గేమ్ లో ఎవ‌రికి ఎంత బ‌లం ఉంద‌నేది చూస్తే ఏ పార్టీకి స‌రైన మెజారిటీ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు శివ‌సేన‌, కాంగ్రెస్, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ క‌లిసి మ‌హా వికాస్ అఘాడీగా ఏర్పడి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండున్న‌ర ఏళ్ల పాటు పూర్తి చేసింది. సంఖ్యా ప‌రంగా చూస్తే మ‌హారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స‌భ్యులు ఉన్నారు. ఇందులో శివ‌సేన ఎమ్మెల్యేల్లో ఒక‌రు మ‌ర‌ణించ‌గా ఇద్ద‌రు అరెస్ట‌య్యారు. జైల్లో ఉన్నారు.

ఈ మొత్తం సంఖ్య‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే 144 స‌భ్యుల సంఖ్య అవ‌స‌రం ఉంది. ప్ర‌స్తుతం సంఖ్యా ప‌రంగా చూస్తే తిరుగుబాటు ప్ర‌క‌టించిన మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) కూట‌మిలోని ఎమ్మెల్యేలు 49 మంది ఉన్నారు.

మ‌హా వికాస్ అఘాడీ లో ఇప్ప‌టి వ‌ర‌కు 168 ఎమ్మెల్యేలు ఉండ‌గా షిండే తిరుగుబాటు త‌ర్వాత 119 ఎమ్మెల్యేల‌కు త‌గ్గింది. దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీకి వాస్త‌వ బ‌లం 113 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇంకా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా ఎమ్మెల్యేలు అవ‌స‌రం ప‌డ‌తారు. ఒక వేళ 49 మందితో కూడిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గ‌నుక దేవేంద్ర ఫ‌డ్న‌వీస్(Fadnavis) సారథ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తు గ‌నుక ఇస్తే వారి సంఖ్య 49తో క‌లుపుకుంటే 162 అవుతుంది.

అప్పుడు సుల‌భ‌వంగా అధికారంలోకి రావ‌చ్చు. మ‌రో వైపు త‌న‌కు చెడ్డ పేరు రాకుండా బీజేపీ జాగ్ర‌త్త‌గా పావులు క‌దుపుతోంది. ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఇదంతా బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

Also Read : మ‌రాఠా పీఠంపై క‌న్నేసిన బీజేపీ

Leave A Reply

Your Email Id will not be published!