Maharashtra Governor : మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయమే కీలకం
రాష్ట్రపతి పాలన విధిస్తారా
Maharashtra Governor : మహారాష్ట్రలో చోటు చేసుకున్న సంక్షోభానికి తెర పెట్టే సమయం వచ్చింది. రాష్ట్రానికి సేఫ్ గార్డ్ గా ఉన్న మొదటి వ్యక్తి గవర్నర్ కోషియార్. ఆయన తీసుకునే నిర్ణయం పైనే మరాఠా భవితవ్యం ఏర్పడింది.
శివసేన, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేన పార్టీకి చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు.
మొదట గుజరాత్ లోని సూరత్ లో బస చేశారు. అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేశారు. షిండే ఇక్కడి నుంచే రాజకీయం మొదలు పెట్టారు.
ధిక్కార స్వరం వినిపించాక ప్రభుత్వం మైనార్టీలో పడి పోయింది. దీంతో అత్యధిక బలం మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ కోషియార్(Maharashtra Governor) ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
వెంటనే బల పరీక్షకు ఆదేశించాలని కోరారు. ప్రస్తుతం బీజేపీ బలం 113 ఉండగా షిండే కూటమికి 49 సభ్యులు ఉన్నారు. బీజేపీ, షిండే కలిస్తే 162 సభ్యులవుతారు.
మొత్తం అసెంబ్లీలో 288 సభ్యులు ఉండగా. మెజారిటీ రావాలంటే 143 కావాల్సి ఉంటుంది. 39 శివసేన ఎమ్మెల్యేలతో పాటు 10 మందికి పైగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఒక వేళ ఏక్ నాథ్ షిండే వర్గం గనుక బేషరతుగా మద్దతు ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు నల్లేరు మీద నడికేనని చెప్పక తప్పదు.
ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్ కోషియార్ ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ ఇస్తారా లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : రాజకీయ చదరంగంలో రాజు ఎవరో