Ashok Gehlot : రాష్ట్ర వ్యాప్తంగా భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం – సీఎం

టైల‌ర్ హ‌త్య కేసును సీరియ‌స్ గా తీసుకున్నాం

Ashok Gehlot : రాజస్థాన్ లోని ఉద‌య్ పూర్ టైల‌ర్ హ‌త్య ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ప‌లువురు ఈ ఘ‌ట‌నను ఖండిస్తున్నారు. ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు నిర‌స‌న‌గా తాము చంపిన‌ట్లు చెప్పారు నిందితులు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మ‌రో వైపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది రాష్ట్రంలో. ముందే గ్ర‌హించిన ప్ర‌భుత్వం రాష్ట్ర‌మంత‌టా 144 సెక్ష‌న్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).

ఇది నెల రోజుల పాటు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంఘ‌ట‌న‌ను సీరియ‌స్ గా తీసుకున్నామ‌ని చెప్పారు. బుధ‌వారం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు.

కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం. ఇది సాధార‌ణ స‌మ‌స్య కాద‌ని, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ఉగ్ర‌వాదానికి ఏమైనా లింకులు ఉన్నాయ‌నే దానిపై కూడా విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు.

ఇక ముందు ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. క‌న్హ‌య్య లాల్ అనే టైల‌ర్ ను హ‌త్య చేయ‌డ‌మే కాకుండా ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు నిందితులు. అంతే కాదు ప్ర‌ధాని మోదీని కూడా చంపుతామంటూ బెదిరించారు.

దీంతో కేంద్రం ఒక్క‌సారిగా అప్ర‌మ‌త్త‌మైంది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను విచార‌ణ‌కు ఆదేశించింది. మ‌రో వైపు ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

ప‌లు చోట్ల ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. 33 జిల్లాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిపి వేశారు. ఇది దారుణ‌మైన ఘ‌ట‌న అని ద‌ర్జీ హ‌త్య‌ను ఖండిస్తున్నామ‌న్నారు సీఎం అశోక్ గెహ్లాట్.

Also Read : టైల‌ర్ దారుణ హ‌త్య‌పై ఎన్ఐఏ విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!