Boris Johnson : పుతిన్ మహిళ అయితే యుద్దం జరిగేది కాదు
బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిష్ జాన్సన్ కామెంట్
Boris Johnson : బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) ను టార్గెట్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైనిక చర్య పేరుతో ఏకపక్షంగా ఉక్రెయిన్ పై దాడి చేయడాన్ని ముందు నుంచీ ఖండిస్తూ వస్తున్నారు.
ఈ మేరకు రష్యా దేశంపై ఆంక్షలు కూడా విధించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ పై దాడి ఆపాలని కోరారు. కానీ రష్యా చీఫ్ పుతిన్ వినిపించు కోలేదు.
ఇంకా వార్ కొనసాగుతూనే ఉంది. వేలాది మంది చని పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. శిథిలమైన భవనాలు కనిపిస్తున్నాయి.
సైనికుల అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. కానీ ఎంత జరిగినా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తగ్గడం లేదు. మరో వైపు తను లొంగేంత వరకు తాము యుద్దాన్ని ఆపేది లేదంటున్నాడు పుతిన్.
మరో వైపు ఆయన ఆరోగ్యం సరిగా లేదంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో బుధవారం పీఎం బోరిస్ జాన్సన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ గనుక మహిళ అయితే గనుక ఉక్రెయిన్ పై యుద్దం కొనసాగి ఉండేది కాదన్నారు బోరిస్ జాన్సన్(Boris Johnson). ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాదు నిప్పులు చెరిగారు జాన్సన్. విషపూరిత పురుషత్వానికి సరైన ఉదాహరణ ఈ యుద్ద కాంక్ష అని పేర్కొన్నారు.
Also Read : మోదీకి స్వాగతం యూఏఈ చీఫ్ ఆలింగనం