Amit shah Devendra Fadnavis : శివసేనకు షాక్ బీజేపీ సక్సెస్
కూల్చేస్తామన్నారు చెప్పినట్టే చేశారు
Amit shah Devendra Fadnavis : మరాఠా అంటేనే శివసేన. శివసేన అంటేనే మహారాష్ట్ర. అలా తయారు చేశాడు దివంగత బాల్ సాహెబ్ ఠాక్రే. భారత దేశ చరిత్రలో హిందూత్వ అనే పదానికి అత్యంత ప్రాముఖ్యతను తీసుకు వచ్చేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఠాక్రే ఉన్నన్ని రోజులు మరాఠాపై కన్నేయాలంటే జడుసుకునే వారు. కానీ మారుతున్న పరిస్థితులు రాజకీయాలలో పెను మార్పులు తీసుకు వచ్చేలా చేశాయి.
మరాఠా యోధుడి తనయులు ఉన్నప్పటికీ వారి మధ్య విభేదాల కారణంగా శివసేన మెల మెల్లగా పట్టు కోల్పోతూ వచ్చింది. చివరకు పవర్ కోసం తమను పూర్తిగా వ్యతిరేకించే కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని అభాసు పాలైంది.
కానీ కేంద్రంతో ప్రధానంగా మోదీ, అమిత్ షాను గట్టిగా వ్యతిరేకించడంలో మాత్రం శివసేన తన పంథాను మార్చుకోలేదు. నిరంతరం యుద్దం చేసింది.
చివరి దాకా పోరాడింది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ పోరాటం చివరకు నువ్వెంత అనే స్థాయికి చేరుకుంది.
తలలు తీసుకుంటామే తప్ప తల వంచమని స్పష్టం చేశారు. కానీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit shah Devendra Fadnavis) పాచికల ముందు, వ్యూహాల ముందు శివసేన ఓడి పోయింది.
పోరాడకుండానే నిష్క్రమించింది. ఇక్కడ విలువలు, సిద్దాంతాల కంటే పదవులే ముఖ్యమన్న సంగతి తేలి పోయింది. ఏది ఏమైనా భారత రాజ్యాంగం మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది.
మొత్తంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని తేలి పోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కనిపించకుండా చక్రం తిప్పిన అమిత్ షా మాత్రం నవ్వుకుంటూనే ఉన్నారు.
Also Read : గవర్నర్ ఆమోదం బీజేపీకి మార్గం సుగమం