Eknath Shinde : శివ సైనికులం బాలా సాహెబ్ వారసులం
శివసేన నేత ఏక్ నాథ్ షిండే కామెంట్
Eknath Shinde : ఎట్టకేలకు మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలి పోయింది. ఇప్పటి దాకా మరాఠా సర్కార్ కు ప్రాతినిధ్యం వహించిన శివసేన పార్టీ చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కోషియార్ కు సమర్పించారు. ఆ వెంటనే గవర్నర్ ఆమోదించారు.
ఈ సందర్భంగా శివసేన స్పోక్స్ పర్సన్ సంజయ్ రౌత్ శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాన్ని ప్రకటించిన వారిపై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా వారు ద్రోహులంటూ మండిపడ్డారు. బలపరీక్షకు సిద్దం అవుతున్న తరుణంలో ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) మీడియాతో మాట్లాడారు. సంచలన కామెంట్స్ చేశారు.
తమదే అసలైన బాలా సాహెబ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీ అని చెప్పారు. తాము రెబల్స్ (తిరుగుబాటు) కాదని నిజమైన శివ సైనికులమని
స్పష్టం చేశారు. పనిలో పనిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పై సంచలన కామెంట్స్ చేశారు.
ఎన్సీపీ శివసేన పార్టీని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని, ఆ దిశగా పావులు కదుపుతున్నాడంటూ ఆరోపించారు. తమకు ఏనాడూ
ప్రయారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు ఏక్ నాథ్ షిండే.
మంత్రిగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవార్ సోదరుడు అజిత్ పవార్ నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడని ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉండగా విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక శివసేన ఆఖరు వరకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు.
గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో బల పరీక్షకు మార్గం సుగమమైంది.
Also Read : శివసేనకు షాక్ బీజేపీ సక్సెస్