Udaipur Tailor Protest : ఉద‌య్ పూర్ లో ఉద్రిక్త‌త భారీ నిర‌స‌న‌

రాళ్లు రువ్విన ఆందోళ‌న‌కారులు

Udaipur Tailor Protest : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన రాజ‌స్తాన్ లోని ఉద‌య్ పూర్ ద‌ర్జీ హ‌త్య ఘ‌ట‌నపై ఆందోళ‌నలు మిన్నంటాయి. ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌భుత్వం 144 సెక్ష‌న్ విధించింది.

నెల రోజుల పాటు ఇది అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. మొత్తం 33 జిల్లాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపి వేశారు. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌కుండా ఉండేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం ఈ హ‌త్య కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్ప‌గించింది.

విచార‌ణ‌లో సంచ‌ల‌న విషయాలు వెలుగు చూశాయి. నిందితులు ఇద్ద‌రికీ పాకిస్తాన్ లోని కరాచీ ఉగ్ర‌వాద సంస్థ‌తో లింకులు ఉన్న‌ట్లు తేల్చారు. ఇదిలా ఉండ‌గా గురువారం ఉద‌యం పెద్ద ఎత్తున హ‌త్య చేయ‌డాన్ని నిర‌సిస్తూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.

ప‌లు హిందూ సంస్థ‌లు భారీ ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. దుకాణాదారులు(Udaipur Tailor Protest) ముంద‌స్తుగా షాప్స్ మూసి వేశారు.

న్యాయం చేయాల‌ని దోషుల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా హ‌త్య‌కు గురైన క‌న్హ‌య్య లాల్ కుటుంబీకుల‌తో రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడ‌తారు.

దీంతో మ‌రింత భ‌ద్ర‌త పెంచారు. 48 ఏళ్ల టైల‌ర్ క‌న్హ‌య్య లాల్ ను ఇద్ద‌రు దుండ‌గులు హ‌త్య చేశారు. ఆపై వీడియో కూడా తీసి పోస్ట్ చేశారు. అందులో మోదీని కూడా ఇలాగే చంపుతామ‌ని బెదిరించారు.

దీనిపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. చంపిన రియాజ్ అఖ్త‌రీ, గౌస్ మ‌హ్మ‌ద్ ల‌ను అరెస్ట్ చేశారు. హంత‌కులు పాకిస్తాన్ కు చెందిన దావ‌త్ ఏ ఇస్లామీతో సంబంధాలు క‌లిగి ఉన్నార‌ని, వారిలో ఒక‌రు 2014లో క‌రాచీకి వెళ్లిన‌ట్లు గుర్తించారు పోలీసులు.

ద‌ర్జీ హ‌త్య ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగిన ఉగ్రదాడి అని, మ‌రికొంత మంది ఇందులో పాల్గొన్నార‌ని తెలిపారు.

Also Read : టైల‌ర్ కిల్ల‌ర్స్ కు పాక్ తో లింకులు

Leave A Reply

Your Email Id will not be published!