Revanth Reddy : అంజ‌న్న అరెస్ట్ పై రేవంత్ ఆగ్ర‌హం

పోలీసుల తీరుపై టీపీసీసీ చీఫ్ ఫైర్

Revanth Reddy : రాష్ట్రంలో పోలీసులు అనుస‌రిస్తున్న తీరు బాగో లేదంటూ మండిప‌డ్డారు రేవంత్ రెడ్డి. పైకి ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నా లోలోప‌ట టీఆర్ఎస్, బీజేపీలు ఒక్క‌టేన‌ని ఆరోపించారు.

ఈ రెండు పార్టీలు సిద్దాంతాల‌ను, విలువ‌ల‌ను గాలికి వ‌దిలేశాయ‌ని మండిప‌డ్డారు. అధికార‌మే ల‌క్ష్యంగా , బీజేపీయేత‌ర పార్టీల‌ను ఇబ్బంది పెట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉండ‌గా తుది శ్వాస వ‌ర‌కు స‌మాజం కోసం, దేశం కోసం శ్ర‌మించిన నాయ‌కురాలు ఇందిరాగాంధీ విగ్ర‌హాల‌కు పార్టీల జెండాలు క‌ట్ట‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ జెండాలు ఎలా క‌డ‌తారంటూ ప్ర‌శ్నించారు.

సోయి త‌ప్పిన పార్టీల‌కు నీతి అంటూ ఎలా ఉంటుంద‌ని అనుకుంటామ‌న్నారు. కాగా జెండాల‌ను ఏర్పాటు చేయ‌బోతున్న వారిని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు అంజ‌న్న యాద‌వ్ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పారు.

అయితే జెండాలు పెడుతున్న వారిని అడ్డుకుని అరెస్ట్ చేయాల్సింది పోయి త‌మ నాయ‌కురాలి విగ్ర‌హంకు ర‌క్ష‌ణ‌గా ఉన్న త‌మ నేత‌ను అరెస్ట్ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

అస‌లు పోలీసులు ఏం ప‌ని చేస్తున్నారో, ఎవ‌రి కోసం ఉన్నారో తెలియ‌డం లేద‌న్నారు రేవంత్ రెడ్డి. బేష‌ర‌తుగా అంజ‌న్న అరెస్ట్ ను తాను ఖండిస్తున్న‌ట్లు చెప్పారు టీపీసీసీ చీఫ్‌.

ప్ర‌జ‌లు రాబోయే రోజుల్లో త‌గిన గుణ‌పాఠం నేర్ప‌డం ఖాయ‌మ‌న్నారు. ఎవ‌రు ఎలాంటి వారో ఇప్ప‌టికే వారికి అర్థ‌మైంద‌న్నారు. ఇలాంటి అరెస్ట్ లు, కేసులు త‌మ‌ను భ‌య పెట్ట‌లేవ‌న్నారు రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఇంకోసారి త‌మ జోలికి వ‌స్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు.

Also Read : కేటీఆర్ పై విశ్వ‌బ్రాహ్మ‌ణుల క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!