YS Sharmila : దొరల పాలన అంతం నా పంతం
మాటలు తప్ప చేతలు లేవు
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర సర్కార్ ను, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆమె పాదయాత్ర చేపట్టారు.
ఆ యాత్ర ఇంకా తెలంగాణ జిల్లాలలో కొనసాగుతూ వస్తోంది. ఈ సందర్భంగా షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వైఎస్ షర్మిల ప్రసంగించారు.
దొరల పాలన అంతం చేసేంత వరకు తాను నిద్ర పోనన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దొరకే ఉందన్నారు. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందంటున్నారు కానీ ఒక్క ఉద్యోగాన్నైనా ఈరోజు వరకు భర్తీ చేశారా అని ఆమె ప్రశ్నించారు.
కబుర్లు చెప్పడంలో, మాయ మాటలు మాట్లాడటంలో కేసీఆర్ ఆరి తేరాడని ఆరోపించారు. ఓ వైపు రైతులు, ఇంకో వైపు నిరుద్యోగులు నానా తంటాలు పడుతున్నారని కానీ ఈరోజు వరకు స్పందించిన పాపాన పోలేదన్నారు.
రాష్ట్రంలో మహిళల, యువతుల, బాలికల భద్రత భయంకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆశించిన సంక్షేమ పాలన తీసుకు వచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టానని చెప్పారు వైఎస్ షర్మిల.
ఆ దిశగా సాగుతున్న తనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నందుకు, వెన్నంటి నడుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మోసాలను గుర్తించి ఓట్లతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్పటి వరకు ఎన్ని భర్తి చేశారో చెప్పాలన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న సీఎం ఇప్పుడు మాట మార్చిండంటూ ఆరోపించారు షర్మిల(YS Sharmila).
Also Read : హర్షా నీ విజయం గర్వకారణం – జగన్