YadaKrishna: తెలంగాణ హీరో యాదాకృష్ణ ఆకస్మిక మృతి

Telangana hero Yadakrishna dies suddenly

Yada Krishna  : ఒకప్పుడు తెలంగాణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు, నిర్మాత యాదాకృష్ణ (61) కన్నుమూశారు. జేఎన్‌టీయూలో ఉద్యోగిగా పనిచేసే యాదాకృష్ణకు చిన్న‌ప్ప‌టి నుంచి నుంచీ సినిమాలంటే అమితాసక్తి. ఆక్ర‌మంలోనే ఒకపక్క ఉద్యోగం చేస్తూనే టీవీ సీరియల్స్‌లో , సినిమాల్లో నటించారాయ‌న‌. ప‌ద‌వీ వివర‌‌మ‌ణ త‌దుప‌రి కూడా ప‌లు చిత్రాల‌లో న‌టించారు. ‘శృంగార పురుషుడు’, ‘ఇరుకింట్లో ఇద్దరు పెళ్లాలు’ గుప్త శాస్త్రం, వ‌య‌స్సు కోరిక, పిక్నిక్ వంటి బీ గ్రేడ్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నారు యాదాకృష్ణ.

ఇరవై చిత్రాల్లో ఆయన హీరోగా నటించిన యాదా కృష్ణ‌ 2010లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంక్రాంతి అల్లుడు సినిమాలో చివ‌రిసారిగా న‌టించారు. ప‌లు సినిమాల‌కు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌ల ఓ కొత్త చిత్రం నిర్మించాలని సన్నాహాలు ప్రారంభించారు. స్క్రిప్ట్ త‌దిత‌రాల‌పై పూర్తి క‌స‌త్తులు చేసారు.

అయితే క‌‌రోనా కార‌ణంగా ఫిలిం ఇండ‌స్ట్రీ మూత‌బ‌డ‌టంతో ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లెదు. ప్ర‌భుత్వం షూటింగ్‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌టంతో తిరిగి ప్ర‌య‌త్నాలు ఆరంభించారు. ఇటీవల యాదాకృష్ణ గుండె సమస్యలతో నిజాంపేట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలోనేక‌న్నుమూసారు.

యాదాకృష్ణకు భార్య రమాదేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఆయన అంత్యక్రియల్ని నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యాదాకృష్ణ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు తీవ్రదిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!