Chalo Assembly: నేడు ముస్లిం మైనార్టీల చలో అసెంబ్లీ – నేతల గృహ నిర్భంధం
Today Chalo Assembly of Muslim minorities - leaders house arrest
Chalo Assembly : సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ తో అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీనికి వివిధ రాజకీయ, ప్రజా సంఘాలుమద్దతు ప్రకటించాయి. విజయవాడ, గుంటూరు, కడప, విశాఖ ముస్లిం సంఘాలు సంఘీభావం తెలిపాయి.
చలో అసంబ్లీ పై జేఎసి కన్వీనర్ ఫారూఖ్ షుబ్లీ మీడియాలో మాట్లాడుతూ… అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన దారుణమన్నారు. ఈ ఘటన ప్రజలను కలచివేసినా… ప్రభుత్వం మాత్రం కదలడం లేదని మండిపడ్డారు. నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలోకనీసం చలనం కనిపించడంలేదని, పైగా దోషులను రక్షించే ప్రయత్నాలు చేస్తూ, మాయమాటలు చెపుతోందని ఆగ్రహంవ్యక్తం చేసారు. అందుకే ఈరోజు ఛలో అసెంబ్లీ కి పిలుపునివ్వాల్సి వచ్చిందని చెప్పారు. అబ్దుల్ సలాం మరణానికి కారకులైన వారిని శిక్షించే వరకు తమ ఉద్యమం ఆగదని, ఢిల్లీ వరకు తమ పోరాటాన్ని తీసుకెళతామని షారూఖ్ స్పష్టం చేశారు.పోలీసులతో తమ పోరాటాన్ని ఆపాలని ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు
మరోవైపు చలో అసెంబ్లీని దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి నుంచి పోలీసులు దానిని నిలువరించే ప్రయత్నాలు చేసారు.ప్రధానంగా మద్దతు ఇస్తున్న టీడీపీ నేతలు, ముస్లిం సంఘాల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేయటంతో పాటు నోటీసు ఇచ్చి.. స్టేషన్‌కు రమ్మంటున్నారని నేతలు చెపుతున్నారు. .
మరోవైపు ముస్లిం మైనార్టీ సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీకి సీపీఐ తన పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాలో మాట్లాడుతూ రాష్‌ట్రంలో వైసీపి సర్కారు వచ్చాక దళితులపైనే కాదు, మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయని, పోలీసుల వేధింపులెన్ని జరుగుతున్న, డిజిపికి కోర్టులు వార్నింగ్‌లు ఇస్తున్నా లెక్కచేయటం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అధికార పార్టీకి వంత పాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుకోవటం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయని మండిపడ్డారు. అబ్దుల్ సలాం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ తో అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీనికి వివిధ రాజకీయ, ప్రజా సంఘాలుమద్దతు ప్రకటించాయి. విజయవాడ, గుంటూరు, కడప, విశాఖ ముస్లిం సంఘాలు సంఘీభావం తెలిపాయి.