Elon Musk : మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉంటే బ్లూ టిక్

రీస్టోర్ చేసిన ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్

Elon Musk : టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్ప‌టికే బ్లూటిక్ ఉన్న వారికి తాజాగా బిగ్ షాక్ ఇచ్చిన మ‌స్క్ ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. ఎవ‌రైతే ట్విట్ట‌ర్ ను వాడుతున్నారో , వారికి సంబంధించి ఒక మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్న‌ట్లయితే తీసేసిన బ్లూ టిక్ ను రీ స్టోర్ చేసేందుకు ఓకే చెప్పారు. ఈ విష‌యాన్ని ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఎలోన్ మ‌స్క్(Elon Musk).

ఒక విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లో , సెల‌బ్రిటీలు , ప్ర‌ముఖ వ్య‌క్తుల ఫ్రొఫైల్ లు కూడా . కొత్త చెల్లింపు ధ్రువీక‌ర‌ణ ఫీచ‌ర్ కు స‌భ్య‌త్వం పొందార‌ని సూచించే వారి ఖాతా ప‌క్క‌న ధృవీక‌రించ‌బ‌డిన టిక్ మార్క్ క‌లిగి ఉంటారు. ఇది కోట్లాది మంది వాడే ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌కు తెలిసిన విష‌యం. బ్లూ టిక్ అనేది హోదానే కాదు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు క‌లిగి ఉంటుంది.

భారీ ఎత్తున ఫాలోవ‌ర్స్ క‌లిగి ఉన్న వారి ప‌ట్ల కొంత వెసులుబాటు ఇచ్చేందుకు సుముఖ‌త క‌న‌బ‌ర్చిన‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ 20న శుక్ర‌వారం మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్న యూజ‌ర్ల‌కు సంబంధించి బ్లూ టిక్ తిరిగి పొంద‌డాన్ని గుర్తించారు. దీంతో వారి సంతోషానికి అంతు లేకుండా పోయింది.

Also Read : కొలువుల‌పై కృత్రిమ మేధ‌స్సు ప్ర‌భావం

Leave A Reply

Your Email Id will not be published!