BBC World Cup Team : బీబీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ టీంలో ముగ్గురికి ఛాన్స్

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు షాక్

BBC World Cup Team : ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏమూల ఏ ఘ‌ట‌న చోటు చేసుకున్నా క్ష‌ణాల్లోనే స‌మాచారాన్ని, వార్తా విశేషాల‌ను అందించే మీడియా సంస్థ‌కు బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్ (బీబీసీ) పేరొందింది. ఇక ఇండియాలో కూడా విస్త‌రించింది. ప్రాంతీయ భాష‌ల్లో బీసీసీ వార్త‌లు, విశేష క‌థ‌నాలు అంద‌జేస్తోంది.

ఈ త‌రుణంలో బీబీసీ ఈ ఏడాదిలో ప్ర‌ప‌చంలో క్రికెట్ ప‌రంగా అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టును ఎంపిక చేసేందుకు స‌ర్వే చేప‌ట్టింది. భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. ఇందులో విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు చోటు ద‌క్క‌లేదు. ఇక ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఇంగ్లండ్ జ‌ట్టు ఎగ‌రేసుకు పోయింది.

ఈ జ‌ట్టుకు జోస్ బ‌ట్ల‌ర్ సార‌థ్యం వ‌హించాడు. ఇక బీబీసీ ఎంపిక చేసిన వ‌ర‌ల్డ్ క్రికెట్ టీంలో(BBC World Cup Team) ఎవ‌రికి చోటు ద‌క్కింద‌నే దానిపై ఉత్కంఠ వీడింది. అయితే విశేషం ఏమిటంటే భార‌త జ‌ట్టు నుంచి రైజింగ్ స్టార్ సూర్య కుమార్ యాద‌వ్ , టాప్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీకి చోటు ద‌క్కింది.

దీనికి బీబీసీ వ‌ర‌ల్డ్ XI ను సిద్దం చేసింది. ఈ మొత్తం జ‌ట్టులో మార్క్ వుడ్ , నోర్త్యా , సామ్ కర‌న్ , షాదాబ్ ఖాన్ , పాండ్యా , గ్లెన్ ఫిలిప్స్ , సూర్య కుమార్ యాద‌వ్ , హేల్స్ , బ‌ట్ల‌ర్ , కోహ్లీ, షా అఫ్రిదిని ఎంపిక చేసింది.

వీరితో పాటు ర‌జా, మాక్స్ వెల్ , స్టోక్స్ , అర్ష్ దీప్ సింగ్ , హ‌స‌రంగాల‌ను కూడా ఎంపిక చేశార‌ని వెల్ల‌డించింది బీబీసీ.

Also Read : షోయ‌బ్ అక్త‌ర్ కు ష‌మీ స్ట్రాంగ్ కౌంట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!