Modi Quad Summit : క్వాడ్ ప్రపంచానికి ఓ దిక్సూచి – మోదీ
సభ్య దేశాల సదస్సులో ప్రధాన మంత్రి
Modi Quad Summit : ప్రస్తుత ప్రపంచం తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది. ఈ తరుణంలో నాలుగు సభ్య దేశాలతో ఏర్పాటైన క్వాడ్ ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
జపాన్ లోని టోక్యోలో క్వాడ్ సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నరేంద్ర మోదీ(Modi Quad Summit) . క్వాడ్ లో అమెరికా, జపాన్ , ఆస్ట్రేలియా, భారత్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
క్వాడ్ సభ్య దేశాల మధ్య పరస్పర నమ్మకం, విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని ఇస్తోందంటూ కితాబు ఇచ్చారు ప్రధాని. ఇండో పసిఫిక్ ను మరింత మెరుగు పరుస్తుందనుకున్న విశ్వాసం, నమ్మకం తనకు ఉందన్నారు మోదీ.
ఈ క్వాడ్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ , భారత పీఎం మోదీ హాజరయ్యారు.
దీంతో యావత్ ప్రపంచం ఈ క్వాడ్ సదస్పుపై ఫోకస్ పెట్టింది. మరో వైపు బైడెన్ తైవాన్ జోలికి వస్తే బాగుండదంటూ చైనాను హెచ్చరించడం, మరో వైపు ఏకపక్షంగా సైనిక చర్య పేరుతో నిరవధికంగా ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యాపై ఆంక్షలు విధించిన ఈ పరిస్థితుల్లో క్వాడ్ సదస్సు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కరోనా కష్ట కాలంలో సభ్య దేశాల మధ్య టీకాల పంపినీ, క్లైమేట్ యాక్షన్ , డిజాస్టర్ మేనేజ్ మెంట్ , ఆర్థిక తోడ్పాటు మరింత పెరిగందన్నారు నరేంద్ర మోదీ(Modi Quad Summit).
ఇదిలా ఉండగా సదస్సుకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బైడెన్ , కిషిదా, అల్బనీస్ తో విడి విడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు.
Also Read : ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా