Asia Cup 2022 : అర‌బ్ వేదికపై క్రికెట్ పండ‌గ

ఆగ‌స్టు 27 నుంచి ఆసియా క‌ప్

Asia Cup 2022 : క్రికెట్ పండ‌గ కు సిద్దం అవుతోంది యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ). ఇప్ప‌టికే ప‌లు టోర్నీల‌కు ఇదే వేదిక‌గా ఉంటూ వ‌స్తోంది. గ‌తంలో షార్జా ఉండేది. ప్ర‌తి ఏటా ఆసియా క‌ప్ నిర్వ‌హిస్తూ వ‌చ్చారు.

కానీ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త రెండేళ్లుగా ఆసియా క‌ప్(Asia Cup 2022) ను నిర్వ‌హించ లేక పోయారు. దీంతో ఈసారి శ్రీ‌లంక‌లో నిర్వ‌హించాల్సి ఉంది టోర్నీని.

కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల‌, ఆర్థిక‌, రాజ‌కీయ సంక్షోభం తీవ్రం కావ‌డంతో టోర్నీని నిర్వ‌హించ లేమంటూ శ్రీ‌లంక క్రికెట్ బోర్డు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి తెలియ చేసింది.

దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ‌ను యూఏఈకి మార్చేశారు. ఇదే విష‌యాన్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనంత‌రం బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ వెల్ల‌డించారు.

గ‌త నాలుగు ఏళ్లుగా ఊరిస్తూ వ‌స్తున్న ఆసియా క‌ప్ రెడీ అయ్యింది. యూఏఈ వేదిక‌గా ఆగ‌స్టు 27 నుంచి మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఆరు జ‌ట్లు పాల్గొంటాయి. భార‌త్ , పాకిస్తాన్ , శ్రీ‌లంక‌, ఆఫ్గ‌నిస్తాన్ లు ఇప్ప‌టికే అర్హ‌త సాధించాయి.

ఆరో బెర్త్ కోసం హాంకాంగ్ , సింగ‌పూర్ , కువైట్ , యూఏఈ క్వాలిఫికేష‌న్ రౌండ్ లో పోటీ ప‌డ‌నున్నాయి. ఇక ఈ టోర్నీకి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లలో మునిగి పోయింది యూఏఈ ప్ర‌భుత్వం.

ఇందుకు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ ప్రోమో విడుద‌ల చేసింది. ఈ వీడియో ఇప్పుడు విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

Also Read : వెస్టిండీస్ తో టీమిండియా రె’ఢీ’

Leave A Reply

Your Email Id will not be published!