Rahul Gandhi Yatra : భారీ హిమపాతం యాత్రకు అంతరాయం
జనవరి 31న కాశ్మీర్ లో బహిరంగ సభ
Rahul Gandhi Yatra : విపరీతమైన మంచు , హిమపాతం కారణంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అంతరాయం ఏర్పడింది. జనవరి 30 సోమవారంతో యాత్ర పూర్తవుతుంది. ఈనెల 31న యాత్ర ముగింపును పురస్కరించుకుని భారీ బహిరంగ సభ చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ.
హిమపాతం కారణంగా శ్రీనగర్ కు వెళ్లే అన్ని విమానాలు ఆలస్యమైనట్లు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కుల్దీప్ సింగ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా విస్తారా ఎయిర్ లైన్స్ ఇవాళ ఢిల్లీ నుండి శ్రీనగర్ కు రెండు విమానాలను రద్దు చేసింది.
గత ఏడాది 2022 సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , పంజాబ్ , ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో పూర్తయింది.
ఇప్పటివరకు 3, 600 కిలోమీటర్లకు పైగా పూర్తయింది. రాహుల్ గాంధీ యాత్రను(Rahul Gandhi Yatra) పురస్కరించుకుని భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసింది జమ్మూ కాశ్మీర్ పోలీస్ . బహిరంగ సభకు దేశంలోని 24 పార్టీలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్ పార్టీ.
మొదటి సారి భారీ ఎత్తున నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ లు అఖిలేష్ యాదవ్ , మాయావతి పాల్గొనలేదు. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని స్వయంగా రాహుల్ గాంధీ కోరారు.
ఇదిలా ఉండగా భద్రతా కారణాల రీత్యా కొందరు నాయకులు హాజరు కావడం లేదని సమాచారం.
Also Read : అఖిలపక్షంతో కేంద్రం కీలక భేటీ