Congress Meeting : కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో పార్టీల కీల‌క భేటీ

ఈడీ ముందుకు సోనియా గాంధీ నేప‌థ్యం

Congress Meeting : ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ గురువారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందుకు హాజ‌రవుతారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీగా మోహ‌రించారు.

నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌లో మ‌నీ లాండ‌రింగ్ కు సంబంధించిన కేసులో త‌ల్లీ కొడుకు సోనియా , రాహుల్ గాంధీల‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్ప‌టికే 5 రోజుల పాటు రాహుల్ గాంధీని ప్ర‌శ్నించింది ఈడీ.

క‌రోనా సోక‌డంతో సోనియా గాంధీ హాజ‌రు కాలేక పోయారు. 21న హాజ‌రు కావాల్సిందిగా ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. ఇదే స‌మ‌యంలో ఈఎల 18 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి.

సోనియా గాంధీ ఈడీ ముందుకు వెళుతున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో మిత్ర‌ప‌క్షాల‌కు చెందిన పార్టీలు హాజ‌ర‌య్యారు. దాదాపు 13 ప్ర‌తిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ(Congress Meeting) అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కీల‌క స‌మావేశానికి అటెండ్ అయ్యాయి.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను బ‌ల‌హీన ప‌ర్చ‌డంలో భాగంగా మోదీ స‌ర్కార్ కుట్ర ప‌న్నుతోందంటూ ఆరోపించాయి. భావ సారూప్య‌త క‌లిగిన ప్ర‌తిప‌క్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్ర‌క‌ట‌న చేశాయి.

కేంద్రంలోని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆరోపించాయి. ఇవాళ జ‌రిగిన కీల‌క భేటీలో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన నేత‌లు హాజ‌రు కావ‌డం విశేషం.

కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, సీపీఎం, సీపీఐ , ఐయుఎంఎల్, ఎన్సీ, టీఆర్ఎస్ , ఎండీఎంక‌కే, ఎన్సీపీ, వీసీకే , శివ‌సేన , ఆర్జేడీ ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్ లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే దానిపై చ‌ర్చించారు.

Also Read : ఎట్ట‌కేల‌కు విడుద‌లైన మ‌హ్మ‌ద్ జుబైర్

Leave A Reply

Your Email Id will not be published!