Amit Shah Fire : అల్లర్లు నేర్పిన గుణపాఠం శాంతికి మార్గం
కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా
Amit Shah Fire : బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో పాలకులు కుల, మతాలను ప్రాతిపదికగా ప్రజలను విడదీశారంటూ ధ్వజమెత్తారు. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. డిసెంబర్ 1, 5 తేదీలలో పోలింగ్ జరగనుంది.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పార్టీలు పెద్ద ఎత్తున నువ్వా నేనా అంటూ హోరెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ రాష్ట్రంలో గత 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలన సాగుతోంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి,
అమిత్ చంద్ర షాకు ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ పార్టీకి ఇక్కడ మంచి పట్టుంది. ఈసారి ఆప్ కూడా తనదైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అమిత్ చంద్ర షా(Amit Shah Fire) నిప్పులు చెరిగారు. 2002లో జరిగిన అల్లర్లు గుణపాఠం నేర్పాయన్నారు.
అందుకే తాము పవర్ లోకి వచ్చాక గుజరాత్ లో వాటిని అణిచి వేశామని, ప్రస్తుతం శాంతి నెలకొందన్నారు. దేశ వ్యాప్తంగా తాము అధికారంలోకి వచ్చాక సీన్ మారిందన్నారు. దేశ ద్రోహులు, ఉగ్రవాదులు, వ్యతిరేక శక్తులు, మావోయిస్టులను ఏకి పారేశామన్నారు. ప్రస్తుతం ఎవరైనా తప్పు చేయాలంటే జడుసుకునేలా చేశామన్నారు అమిత్ షా.
రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు అడ్రస్ లేకుండా పోతాయని జోష్యం చెప్పారు. తాము మరోసారి పవర్ లోకి వస్తామని, కానీ మెజారిటీపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని స్పష్టం చేశారు.
Also Read : తెలంగాణలో కమలం పాగా ఖాయం