Joe Biden : అరుదైన నాయకుడు గోర్బచెవ్ – బైడెన్
యావత్ ప్రపంచానికి తీరని లోటు
Joe Biden : ముందు చూపు కలిగిన అరుదైన నాయకుడు మిఖైల్ గోర్బచెవ్ అని కొనియాడారు అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden). ఆయన బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 91 ఏళ్ల వయస్సులో గోర్బచెవ్ కన్నుమూశారు.
మైఖేల్ మరణం యావత్ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు ప్రెసిడెంట్. మ్యాన్ ఆఫ్ రిమార్కబుల్ విజన్ అంటూ కొనియాడారు. గోర్బచెవ్ మరణాన్ని అధికారికంగా రష్యా ప్రభుత్వం ప్రకటించింది.
తీవ్రమైన, సుదీర్ఘ అనారోగ్యం కారణంగా మాస్కో లోని సెంట్రల్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారంటూ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నాయకులు, ప్రధానమంత్రులు గోర్బచెవ్ కు ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చిన అరుదైన నాయకుడు అంటూ ప్రశంసించారు బైడెన్(Joe Biden). ఆయన తీసుకున్న చర్యలు, నిర్ణయాలు ఎంతో మందికి స్వేచ్ఛను ప్రసాదించాయని తెలిపారు.
గోర్బచెవ్ ముందు చూపు కలిగిన, భవిష్యత్ పట్ల నమ్మకం కలిగిన ప్రత్యేకత కలిగిన దేశాధినేతగా అభివర్ణించారు. 1985 – 1991 మధ్య అధికారంలో ఉన్న గోర్బచెవ్ సోవియట్ యూనియన్ , యుఎస్ మధ్య నెలకొన్న అగాధాన్ని తొలగించే ప్రయత్నం చేశాడు.
ప్రచ్చన్న యుద్దంలో జీవించి ఉన్న చివరి నాయకుడిగా పేరొందారు గోర్బచెవ్. మాజీ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ జేమ్స్ బేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోర్బచెవ్ ను ఎల్లప్పటికీ ప్రపంచం గుర్తు పెట్టుకుందన్నారు.
సామ్రాజ్యవాదాన్ని ఏకతాటి పైకి తీసుకు రావడానికి బలాన్ని ఉపయోగించకుండా తన నిర్ణయం ద్వారా ప్రచ్చన్న యుద్దాన్ని శాంతియుతంగా ముగించడంలో గోర్బచెవ్ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు.
Also Read : రష్యా మాజీ చీఫ్ మిఖైల్ గోర్బచెవ్ ఇక లేరు