Australian PM Modi : భారత్ తో బలమైన భాగస్వామ్యం – పీఎం
వచ్చే వారం రానున్న అల్బనీస్
Australian PM Modi : భారత్ తో బలమైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్(Australian PM). శనివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో(PM Modi) భేటీ అవుతానని వచ్చే వారంలో భారత్ లో పర్యటిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా పీఎం భారత పర్యటన దాదాపుగా ఖరారైంది. ఆయన టూర్ మార్చి 8 నుంచి 11 మధ్యలో ఉండవచ్చు. ఇప్పటికే భారత దేశం జి20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీ వేదికగా ప్రపంచ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులతో వరుసగా సమావేశాలు కొనసాగుతున్నాయి.
భద్రతా సహకారాన్ని బలోపేతం చేసేందుకు, ఆర్థిక , క్రీడా , విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తాను , భారత ప్రధాన మత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తామని అల్బనీస్(Australian PM Modi) పేర్కొన్నారు. భారత దేశం, ఆస్ట్రేలియా భాగస్వామ్యం ప్రాంతీయ స్థిరత్వానికి మంచిదని పేర్కొన్నారు.
ఇది మరింత వాణిజ్యం, పెట్టుబడులకు దారి తీస్తుందని ఆస్ట్రేలియా పీఎం పేర్కొన్నారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో వచ్చే వారం తాను భారత్ లో పర్యటిస్తానని స్పష్టం చేశారు ఆంథోనీ అల్బనీస్.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా పీఎంతో పాటు వాణిజ్య శాఖ మంత్రి డాన్ ఫారెల్ , వనరుల శాఖ మంత్రి మడేలిన్ కింగ్ , సీనియర్ ఉన్నతాధికారుల బృందం రానుంది. ఇదే సమయంలో అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టును వీక్షించనున్నారు ఇరు దేశాల పీఎంలు.
Also Read : జై శంకర్ తో మెలానీ జోలీ భేటీ