Anantnag Encounter : కూలీలను టార్గెట్ చేసిన టెర్రరిస్ట్ ఖతం
జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాల గాలింపు
Anantnag Encounter : కూలీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడేందుకు ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదిని మట్టుబెట్టారు భారత బలగాలు. పోలీసు కస్టడీలో ఉన్న టెర్రరిస్టు ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున అనంత్ నాగ్(Anantnag Encounter) జిల్లా లోని బిజ్ బెహరాలోని చెకీ దుడు ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కుల్గామ్ కు చెందిన సజ్జాద్ తంత్రే గా గుర్తించినట్లు సమాచారం. సెర్చ్ పార్టీ గాలింపు చర్యలకు దిగిన సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సజ్జాద్ తంత్రేను పట్టుకున్నారు. అతడిని ఎస్డీహెచ్ బిజ్ బెహరాకు తరలించారు.
అక్కడ వైద్యులు ఉగ్రవాదిని చని పోయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. సజ్జాద్ తంత్రే గత వారం ఇద్దరు కూలీలపై దాడికి పాల్పడ్డాడని తెలిపారు. తంత్రే లష్కరే తోయిబాకు సపోర్ట్ గా ఉన్నాడు.
పీఎస్ఏ నుండి విడుదలైన వ్యక్తి. 13న అనంత్ నాగ్ లోని బిజ్ బెహరా , రఖ్ మోమెన్ లో ఇద్దరు బయటి కార్మికులపై దాడికి పాల్పడ్డాడని స్పష్టం చేశారు. ఇందులో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక కూలి చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నారు.
కూలీలపై దాడికి పాల్పడిన పిస్టల్ , ఉగ్రవాద నేరాలకు ఉపయోగించిన వాహనం కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. మరికొందరిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. మిగతా టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నామన్నారు.
Also Read : ఉక్రెయిన్ కు భరోసా జెలెన్ స్కీకి ఆసరా