PM Modi Aadi Mahotsav : ఆది మహోత్సవం అభివృద్దికి సంకేతం
పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi Aadi Mahotsav : కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ది పథంలోకి తీసుకు వెళుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆది మహోత్సవ్ ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివాసీలు జన జీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్లు కూడా అందరి లాగే సమాన అవకాశాలను అంది పుచ్చు కోవాలని కోరారు నరేంద్ర మోదీ. గిరిజనుల అభివృద్ది, విద్య ప్రాధాన్యతకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి.
ఉపాధిని పెంపొందించేందుకు అటవీ ఉత్పత్తులకు ప్రాథమిక ప్రాసెసింగ్ , విలువ జోడింపు లభ్యతను నిర్ధారించేందుకు గాను వాన్ ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు ప్రధానమంత్రి(PM Modi Aadi Mahotsav).
దేశ రాజధాని న్యూఢిల్లీలో గిరిజన సంస్కృతులు, ఉత్పత్తులను జరుపుకునేందుకు ఆది మహోత్సవ్ ను గురువారం ప్రారంభించారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ప్రతి రంగంలో కూడా ఆదివాసీలు భాగస్వామ్యం కలిగి ఉండాలన్నారు. అందులో భాగంగా విద్య, ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు ప్రధానమంత్రి.
గత ఎనిమిది సంవత్సరాల నుంచి గిరిజన సంస్కృతి గురించి నేను గమనించాను. వారికి సంబంధించిన కార్యక్రమాలను చూశాను. వారిలో అద్భుతమైన నైపుణ్యం దాగి ఉందన్నారు. అందుకే జాతిలో మిళితం చేస్తే వారికి సరైన గుర్తింపు లభిస్తుందని చెప్పారు మోదీ.
వారి నుంచి తాను కూడా ఎంతో నేర్చుకున్నానని చెప్పారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. భారత దేశ సంప్రదాయ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి(PM Modi Aadi Mahotsav) ప్రత్యేకంగా ప్రశంసించారు. గత పాలకుల హయాంలో వెదురును కత్తిరించడం పరిమితం చేశారు. కానీ మేం వచ్చాక దానిని తొలగించాం. ఇవాళ వెదురు ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉందన్నారు.
Also Read : కొండపోచమ్మను పరిశీలించిన సీఎం