Aaditya Thackeray KTR : మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే(Aaditya Thackeray KTR) మంగళవారం టీ హబ్ లో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన ఠాక్రేతో పాటు శివసేన ఎంబీటీకి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఉన్నారు.
భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ – హబ్ లో ములాఖత్ అయ్యారు. దేశానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్(KTR) రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేకంగా వివరించారు. ఇప్పటికే రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించిందని తెలిపారు. ఇవాళ ఐటీ పరంగా హైదరాబాద్ ఇండియాకు ఐ కాన్ గా మారిందని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, ఔత్సాహకులకు తాము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు ఆదిత్యా ఠాక్రేకు తెలిపారు.
ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా తాము స్వాగతం పలుకుతామని , ఇప్పటికే తెలంగాణ ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, రియాల్టీ పరంగా టాప్ లో దూసుకు పోతోందని తెలిపారు. ప్రస్తుతం తమ రాష్ట్రం అనుసరిస్తున్న మోడల్ నే కేంద్రం కాపీ కొడుతోందంటూ ఆరోపించారు. మాజీ మంత్రి , ప్రస్తుత మంత్రి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : కరోనా కొత్త వేవ్ లేదు ఆందోళన వద్దు