Aaditya Thackeray : బీజేపీ హిందూత్వంపై నమ్మకం లేదు
మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే కామెంట్స్
Aaditya Thackeray : మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. తమకు హిందుత్వంపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. కానీ బీజేపీ హిందుత్వంపై నమ్మకం లేదన్నారు శివసేన యూబీటీ నేత.
రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం ఏక్ నాథ్ షిండే , బీజేపీ రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలు తినే వాటిపై తాము కల్చబోమన్నారు. బీజేపీ హిందుత్వమైతే అది నాకు , మా తండ్రి ఉద్దవ్ ఠాక్రేకు, మా తాత దివంగత బాల్ సాహేబ్ ఠాక్రేకు, మా రాష్ట్ర ప్రజలకు ఆమోద యోగ్యం కాదన్నారు.
ఆదిత్యా ఠాక్రే(Aaditya Thackeray) హైదరాబాద్ లోని గీత యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే అయోధ్యలో రామ మందిరం కట్టడం లేదని ఆరోపించారు. అయోధ్య లో ఆలయాన్ని కేంద్ర సర్కార్ నిర్మిస్తోందని మీరు అనుకుంటే అది తప్పు అని , కేంద్రం మాత్రం కాదని అన్నారు.
కేవలం సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించినందు వల్లనే ఇవాళ ఆలయాన్ని నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో అప్పటి శివసేనపై బీజేపీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.
2014లో బీజేపీ తమను వెన్నుపోటు పొడిచిందన్నారు మాజీ మంత్రి. ఇవాళ కాశ్మీరీ పండిట్లను చంపుతున్నది ఎవరో చెప్పాలన్నారు. ఏక్ నాథ్ షిండేను ప్రమాదకరమని తాను భావించడం లేదని అన్నారు ఆదిత్యా ఠాక్రే.
Also Read : రైల్వేలపై గత పాలకుల నిర్లక్ష్యం