AAP Gujarat : ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి పవర్ లోకి వచ్చింది.
ఈ తరుణంలో పార్టీని దేశ మంతటా విస్తరించే పనిలో పడ్డారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో ఇప్పటికే ఆప్ చెందిన బాధ్యులు అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా గుజరాత్ పై ఎక్కువగా ఫోకస్ (AAP Gujarat)పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఆప్ చీఫ్.
అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అహ్మదాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలలో ఆప్ పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ (AAP Gujarat)గత ఏడాది రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ప్రకటించారు.
ఇప్పటికే ఆప్ పంజాబ్ లో జెండా ఎగుర వేసింది. గోవా రాష్ట్రంలో పట్టు సాధించింది. ఇక గుజరాత్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. 1995 నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ వరుస కార్యక్రమాలలో మునిగి పోయింది.
ఇందులో భాగంగా కేజ్రీవాల్ తో పాటు భగవంత్ మాన్ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా వారు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.
అనంతరం రెండు కిలోమీటర్ల పాటు రోడ్ షో చేపడతారు. దీనిని పార్టీ తిరంగా యాత్ర అని పేరు పెట్టారు.
Also Read : ఢిల్లీలో విద్యా..ఆరోగ్య వ్యవస్థ భేష్ – స్టాలిన్