AAP Appoints Asu Keyho : నాగాలాండ్ ఆప్ చీఫ్ గా అసు కీహో
ప్రకటించిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
AAP Appoints Asu Keyho : ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జాతీయ పార్టీగా అవతరించడంతో దేశ వ్యాప్తంగా తన కదలికలను విస్తృతం చేసింది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగాలాండ్ రాష్ట్ర అధ్యక్షుడి అసు కీహోను(AAP Appoints Asu Keyho) నియమించింది ఆప్. ఈ విషయాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి సందీప్ పాఠక్ వెల్లడించారు.
ఆయన ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నాగాలాండ్ , మేఘాలయాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. బుధవారం ఈ విషయం వెల్లడించంది. ఇక ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లకు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 18న ప్రకటించింది.
మూడు రాష్ట్రాల ఫలితాలు మార్చి 2, 2023న వెల్లడించనుంది ఈసీ. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్ , మేఘాలయలలో ఫిబ్రవరి 27న ఒకే దశలో ఓటింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక మార్చి 12, 15, 22 తేదీలలో నాగాలాండ్ , మేఘాలయ , త్రిపుర రాష్ట్రాల ఎన్నికల గడువు ముగియనున్నట్లు సీఈసీ తెలిపింది. మూడు రాష్ట్రాలలో ఒక్కొక్కటి 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా నాగాలాండ్ , మేఘాలయ, త్రిపురలలో కలిపి 62.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 31.47 లక్షల మంది మహిళా ఓటర్లు ఉండగా 97 లక్షల మంది ఓటర్లు పురుషులు ఉన్నారని ఈసీ వెల్లడించింది. 31,700 మంది దివ్యాంగుల ఓటర్లు, 1.76 లక్షలకు పైగా ఉన్నారని పేర్కొంది.
Also Read : మోడీకి ఆజ్మీర్ దర్గా ‘చాదర్’