Arvind Kejriwal : పంజాబ్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో ఆప్ మాజీ నాయకుడు కుమార్ విశ్వాస్ తనపై చేసిన ఆరోపణలు కలకలం రేపడంతో తీవ్రంగా స్పందించారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ).
చన్నీ తనపై దర్యాప్తు చేయాలని అనడం దానికి అమిత్ షా ఓకే చెప్పడం తనకు నవ్వు తెప్పించేలా చేసిందన్నారు.
ఇది కామెడీ తప్పా మరొకటి కాదన్నారు. ఎన్నికలకు ముందు వీరిద్దరూ లేఖలు ఇచ్చి పుచ్చుకున్నారంటూ ఆరోపించారు కేజ్రీవాల్.
తాను వేర్పాటువాద సానుభూతి పరుడంటూ నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు.
ఇదంతా రాజకీయంగా కుట్రలో భాగమేనని మండిపడ్డారు. ఆప్ పట్ల పంజాబ్ ప్రజలు సానుకూల ధోరణితో ఉన్నారని జోస్యం చెప్పారు.
చన్నీ లేఖకు దర్యాప్తు చేస్తామంటూ అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు అరవింద్ కేజ్రీవాల్.
ఇద్దరు ప్రత్యర్థులకు మార్చి 10 తర్వాత షాక్ తగలడం ఖాయమన్నారు. కామెడీ మూవీ చూసినట్లుగా ఉందన్నారు.
మరో రెండు రోజుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ – ఎన్ఐఏ తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే చాన్స్ ఉందని ఓ ఆఫీసర్ తెలిపారని చెప్పారు సీఎం.
అయితే తాను కూడా అన్ని విచారణలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
కేంద్ర హొం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా దేశంలో భద్రతను ఓ కామెడీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. చాలా సార్లు నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు. కానీ ఏ సంస్థ తన అవినీతి, అక్రమాలను కనుగొనలేక పోయిందన్నారు.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఓ కవిత చదివారు. అవినీతి పరులాంతా ఏకమయ్యారు. నా పట్ల భయంతో వారంతా ఒక్కటయ్యారు. వాళ్ల దృష్టిలో నేను వాళ్లకు టెర్రరిస్టునే. నా వల్ల వాళ్లు ప్రశాంతంగా నిద్ర లేక పోతున్నారు.
వందేళ్ల భగత్ సింగ్ ను టెర్రరిస్టు అన్నారు. ఆయన శిష్యుడైన తనను కూడా ఉగ్రవాది అంటున్నారని అన్నారు.
Also Read : అవునో కాదో కేజ్రీవాల్ చెప్పాలి