KS Eshwarappa : కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను(KS Eshwarappa) వెంటనే అరెస్ట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది.
వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. సంతోష్ పాటిల్ రూ. 4 కోట్ల పనులకు సంబంధించి మంత్రితో పాటు ఇద్దరు అనుచరులు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ సూసైడ్ నోట్ లో రాయడం కలకలం రేగింది.
దీంతో మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంత్రి, అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ తరుణంలో మొదటి నుంచి తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదంటూ వచ్చిన కేఎస్ ఈశ్వరప్పు ఉన్నట్టుండి తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దీని వెనుక హైకమాండ్ ఉందని సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ సైతం మంత్రి ఈశ్వరప్పతో(KS Eshwarappa) పాటు అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
వర్క్ పర్మిట్ ఇవ్వకుండా బిల్లులు ఎలా చెల్లిస్తారని, ప్రాథమిక విచారణ తర్వాత తాను తప్పుకుంటానని చెబుతూ వచ్చారు ఈశ్వరప్ప. ఆయన తన పదవికి రాజీనామా చేస్తే సరి పోదని అరెస్ట్ చేయాలని కోరింది ఆప్.
అంతే కాకుండా మంత్రి శాఖలో చోటు చేసుకున్న కుంభ కోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆప్ కర్ణాటక చీఫ్ పృథ్వీ రెడ్డి.
ఇదిలా ఉండగా మంత్రిని అరెస్ట్ చేయాలంటూ కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు మాజీ సీఎం సిద్దరామయ్య బెంగళూరులోని విధాన సౌధలో నిరసనలు చేపట్టారు.
Also Read : రాహుల్ గాంధీపై హార్దిక్ పటేల్ ఫైర్