AAP Chhattisgarh : ఇటీవల పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను మట్టి కరిపించి పవర్ లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలలోకి విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే త్వరలో ఎన్నికలు జరగబోయే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోకి ఎంటరైంది. తాజాగా ఛత్తీస్ గఢ్ (AAP Chhattisgarh)లో సైతం పాగా వేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
దేశ వ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉంది ఆప్. గోవాలో పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ ఒక రకంగా బీజేపీ ఓటు బ్యాంకు కంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొడుతోంది.
2023లో ఆప్ జెండా ఎగుర వేసేందుకు గాను ఇప్పటి నుంచే కసరత్తు స్టార్ట చేసింది. గతంలో 2018లో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 90 స్థానాలకు గాను 85 స్థానాల్లో పోటీ చేసింది.
కానీ ఒక్క సీటు కూడా గెలుచు కోలేక పోయింది ఆప్. తాజాగా పంజాబ్ లో ప్రజలు ఇచ్చిన అఖండ తీర్పుతో ఇక్కడ సత్తా చాటాలని చూస్తోంది.
2023లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచే వ్యూహాలు తయారు చేసేందుకు గాను ఆప్ సీనియర్ లీడర్ గోపాల్ రాయ్ సమావేశం చేపట్టారు.
ఆప్ రాయ్ పూర్ లో ఇవాళ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ కాంగ్రెస్ 68 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 15 సీట్లు వచ్చాయి.
అజిత్ జోగి కి చెందిన జనతా పార్టీ, బీఎస్పీ కూటమికి ఏడు సీట్లు దక్కాయి. వచ్చే ఎన్నికల్లో ఆప్(AAP Chhattisgarh) గట్టి పోటీ ఇవ్వగలమని భావిస్తోంది.
తాము సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టామని తెలిపారు రాష్ట్ర ఆప్ చీఫ్ కోమల్ హుపెండి . ప్జా సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యిందంటూ ఆరోపించారు.
Also Read : నేను సరే మరి మోదీ మాటేంటి