AAP : గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హార్దిక్ పటేల్ తాజాగా కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కొంత మంది రాష్ట్ర పార్టీ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు.
అంతే కాదు తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. ఈ తరుణంలో ఆయన పార్టీని వీడనున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నాయకత్వం హార్దిక్ పటేల్ ఒకే వేళ కాంగ్రెస్ పార్టీని విడీతే తాము పార్టీలోకి తీసుకునేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఆ పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతం అయ్యే బదులు ప్రజాస్వమ్యయుతంగా ఉండే ఆప్ లో చేరడం బెటర్ అని పేర్కొంది. ఈ మేరకు ఆప్ గుజరాత్ పార్టీ చీఫ్ గోపాల్ ఇటాలియా హార్దిక్ పటేల్ కు సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.
ఇది సారూప్యత కలిగిన పార్టీ అని అభివర్ణించారు. భారీ క్యాడర్ , ప్రజా సమూహపు మద్దతు కలిగిన నాయకుడు హార్దిక్ పటేల్ అని, అలాంటి నిబద్దత కలిగిన నాయకులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండదని ఆరోపించారు.
అంతర్గత కలహాలతో ఎందుకు ఆ పార్టీలో ఉండడం. ఇష్టం లేక పోతే వెంటనే ఆప్ లాంటి ఆలోచనా దృక్ఫథం కలిగిన పార్టీలో చేరాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేస్తూ విలువైన సమయాన్ని ఎందుకు వదులు కోవాలని ప్రశ్నించారు. గోపాల్ ఇటాలియా ఇవాళ మీడియాతో మాట్లాడారు.
Also Read : మోదీ తెల్లతోలు కప్పుకున్న పాలకుడు