Assam CM Kejriwal : ఆప్ పార్టీ కాదు పొలిటికల్ స్టార్టప్ – హిమంత
అరవింద్ కేజ్రీవాల్ ఆటలు సాగవు
Assam CM Kejriwal : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది పార్టీ కాదని అది ఒక పొలిటికల్ స్టార్టప్ (అంకుర సంస్థ) అని ఎద్దేవా చేశారు. ఆదివారం హిమంత బిస్వా శర్మ(Assam CM) మీడియాతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని మండిపడ్డారు.
రాజకీయ ప్రారంభం విఫలమైందన్నారు. సీఎం హిందూస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అంతం చేస్తానని ప్రకటించిన సీఎం ఇప్పుడు ఆప్ పూర్తిగా కరప్షన్ కు కేరాఫ్ గా మారి పోయిందంటూ మండిపడ్డారు.
రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో కేజ్రీవాల్(Arvind Kejriwal) , అప్ అగ్ర నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆప్ ఒక విఫలమైన రాజకీయ ప్రారంభమని పేర్కొన్నారు సీఎం. 10 ఏళ్ల తర్వాత కూడా ఎంఎస్ఎంఈ రకంగానైనా అభివృద్ది చెందలేదన్నారు.
వాళ్లు చెబుతున్నవన్నీ నీతి సూత్రాలు కానీ ఆచరణలో అట్టర్ ప్లాప్ అంటూ ఆరోపించారు హిమంత బిస్వా శర్మ. ఇదిలా ఉండగా ఎన్నికల తరుణంలో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్దం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇక ఢిల్లీ మహా నగర కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 4న పోలింగ్ జరగనుంది. అస్సాం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : దీదీ క్షమాపణ చెప్పాల్సిందే – లాకెట్ ఛటర్జీ