Bhagwant Mann : ఆప్ కా పంజాబ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’

భ‌గ‌వంత్ మాన్ కు భ‌గ‌త్ సింగ్ అంటే ప్రాణం

Bhagwant Mann : విప్ల‌వం అంటే విందు భోజ‌నం కాదు. అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారు. అవినీతికి అంద‌లం ఎక్కిన వారికి విప్ల‌వం పేరు ఎత్తితే చాలు అంతెత్తున ఎగిరి ప‌డ‌తారు.

కానీ ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదాన్ని మొద‌టి సారిగా ఈ దేశంలో వాడింది ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడిన యోధుడు భ‌గ‌త్ సింగ్. ఇదే నినాదం పంజాబ్ లో ఆప్ భుజానికి ఎత్తుకుంది.

అంతే కాదు పార్ల‌మెంట్ లో సైతం ఎంపీగా ప‌లుమార్లు మేరా భార‌త్ మ‌హాన్ అంటూనే ఇంక్విలాబ్ జిందాబాద్ అని నిన‌దించాడు ప్ర‌స్తుతం పంజాబ్ లో కొలువు తీరిన సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann).

ఆయ‌న‌కు స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ అంటే చ‌చ్చేంత ఇష్టం. అందుకే పంజాబ్ రాష్ట్ర చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయానికి శ్రీ‌కారం చుట్టాడు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 117 సీట్ల‌కు గాను 92 సీట్లు కైవ‌సం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్ర‌చారంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూనే ముందుకు సాగాడు భ‌గ‌వంత్ మాన్ . ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఏం మాట్లాడినా చివ‌రన ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదం తో ముగిస్తాడు.

త‌న ప్ర‌మాణ స్వీకారాన్ని పంజాబ్ రాజ్ భ‌వ‌న్ లో కాకుండా భ‌గ‌త్ సింగ్ ఊరు ఖ‌ట్క‌ర్ క‌లాన్ లో ఏర్పాటు చేశాడు. అంతే కాదు మార్చి 23న భ‌గ‌త్ సింగ్ వ‌ర్దంతి సంద‌ర్భంగా పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సెల‌వు ప్ర‌క‌టించాడు.

ఈ సంద‌ర్భంగా ఘ‌నంగా నివాళులు అర్పించాడు. వ‌స్తూనే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న భ‌గ‌వంత్ మాన్ అవినీతికి వ్య‌తిరేకంగా టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేశాడు.

ఎవ‌రైనా లంచం అడిగితే త‌న‌కు వీడియో మెస్సేజ్ లేదా మెస్సేజ్ పంపాల‌ని కోరాడు.

Also Read : ‘ష‌హీద్’ చెర‌గ‌ని సంత‌కం

Leave A Reply

Your Email Id will not be published!