Sanjay Singh : దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా కేవలం ఒకే ఒక్క రాష్ట్రంపై ఎక్కువగా ఫోకస్ ఉంటోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉత్తర ప్రదేశ్ లో ఉన్నాయి.
ఇప్పటికే పవర్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రైతులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంటోంది. ఇప్పటికే ఐదు ఆరు విడతల పోలింగ్ ముగిసింది.
సమాజ్ వాది పార్టీ బీజేపీకి గట్టి పోటీదారుగా ఉంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీలో బీజేపీ పవర్ లోకి రాకుండా ఉండేందుకు అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్ వాది పార్టీతో కలిసి పని చేస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ అగ్ర నేత సంజయ్ సింగ్(Sanjay Singh).
ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు యూపీలో కలకలం రేపాయి. కాషాయ పార్టీని గద్దె దించేందుకు అఖిలేష్ యాదవ్ కు మద్దతు ఇస్తామన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ కు ఎదురే లేదన్నారు.
తాము స్వతంత్రంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఉత్తరాఖండ్ , గోవాలోనూ ఆప్ వైపు ప్రజలు మొగ్గు చూపారని చెప్పారు. ఆప్ ను ప్రజలు తమ పార్టీగా భావిస్తున్నారని తెలిపారు.
ఇక యూపీలోను ఆప్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. ఎవరైతే ప్రజల కోసం పని చేస్తారో వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఈసారి యూపీలో మార్పు ఖాయమన్నారు.
తమ పార్టీ చేసిన హామీలను మిగతా పార్టీలు కాపీ కొడుతున్నాయంటూ సంజయ్ సింగ్ ఆరోపించారు.
Also Read : మోదీ రైతులకు సాయం ఏదీ