AAP Minister Atishi : కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఊరుకోం
ఆరోపించిన ఆప్ మంత్రి అతిషి
AAP Minister Atishi : న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎలాంటి ఆధారాలు లేక పోయినా పనిగట్టుకుని కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆప్ ఆరోపించింది. ఆ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి అతిషి మంగళవారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు పంపించడాన్ని తప్పు పట్టారు.
AAP Minister Atishi Serious Comments on Kejriwal Arrest
త్వరలో దేశంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆప్ తో పాటు పలు ప్రధాన పార్టీలన్నీ ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. దీనిని కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ తట్టుకోలేక పోతోందంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రయోగించడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారి పోయిందని ఆరోపించారు. తమకు లొంగి పోతే ఎలాంటి కేసులు ఉండవని , కానీ ఎదిరిస్తే మాత్రం కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురి చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు అతిషి(Atishi) . ఇది మంచి పద్దతి కాదని, మార్చు కోవాలని సూచించారు.
ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు హేమంత్ సోరేన్, భగవంత్ మాన్, కేసీఆర్ , పినరయి విజయన్ , ఎంకే స్టాలిన లను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారంటూ ఆరోపించారు అతిషి.
Also Read : Kasani Jnaneshwar : టీడీపీకి కాసాని కటీఫ్
