Arvind Kejriwal : 117 మందితో ఆప్ రెండో లిస్టు రిలీజ్

ప్ర‌క‌టించిన ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : దేశ రాజ‌ధాని ఢిల్లీ మ‌హాన‌గ‌రానికి సంబంధించిన కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ బ‌ల్దియా ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆదివారం రెండో జాబితాను ప్ర‌క‌టించారు. బ‌ల్దియా ఎన్నిక‌ల కోసం మొత్తం 117 మంది అభ్య‌ర్థుల‌ను విడుద‌ల చేశారు.

అంత‌కు ముందు రోజు ఆప్ జాతీయ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్(Arvind Kejriwal) గ‌త 15 ఏళ్లుగా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) లో ఏమేం చేస్తామ‌నే దాని గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉండ‌గా ఇవే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆప్ మొద‌టి జాబితాను శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

మొత్తం 134 మంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసింది. ఇప్ప‌టికే ఢిల్లీ ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ 4న ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌స్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 250 మంది స‌భ్యుల తుది జాబితా పూర్త‌యింది.

ఇక అన్ని స‌ర్వేల‌లో ఆప్ కు అగ్ర స్థానం ల‌భించ‌డం విశేషం. రెండవ జాబితాలో పాత పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్య‌త ల‌భించింది. ప‌ని చేసే వారిని ఎంపిక చేయ‌డం పార్టీకి వాయిస్ గా మారింది. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారు, వాలంటీర్లు టికెట్ పంపిణీలో ప్రాధాన్య‌త క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.

ఇదిలా ఉండ‌గా టికెట్లు ఇచ్చే కంటే ముందు ఆప్ స‌ర్వే చేప‌ట్టింది. ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తీసుకుంది. 20 వేల మందికి పైగా పార్టీ కార్య‌క‌ర్త‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

Also Read : కొలిజియం వ్య‌వ‌స్థ స‌రైన‌దే – మాజీ సీజేఐ

Leave A Reply

Your Email Id will not be published!